మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత, డ్రాగన్ సెట్లో అడుగుపెడతాడు. ఫిబ్రవరి నుంచి ఆ సినిమా షూటింగ్ తోనే బీజ అవుతాడు. ఇది మొదటి నుంచి వినిపిస్తున్న వార్తే.. ఐతే సడన్ గా సీన్ లోకి దేవర సీక్వెల్ వచ్చేసింది. స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టానంటూ కొరటాల శివ ఇచ్చిన హింట్ తో సీన్ మారింది. మరోసారి మాస్ జాతరకి రంగం సిద్దమౌతోందని తేలింది. ఐతే ఒకవైపు వార్ 2 మూవీ షూటింగ్ కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. మరో వైపు డ్రాగన్ సెట్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సో అన్నీ ఫ్లోలో జరిగిపోతున్నాయి. కనీసం ఏడాది వరకు ఎన్టీఆర్ మరో వైపు చూడలేనంత బిజీ అవుతాడని తేలుతోంది కూడా… ఇలాంటి టైంలో దేవర 2 స్క్రిప్ట్ వర్క్ షూరూ అయ్యిందనటానికి రీజనేంటి? ఆల్రెడీ రెండో భాగం కథ ఎప్పుడో సిద్ధం అన్నారు.. మరి మళ్లీ స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయంటే..? ఏం జరుగుతోంది? ఓవరాల్ గా దేవర 2 ఎనౌన్స్ మెంట్ వెనకున్న లాజిక్ ఏంటి?
కొరటాల శివ తన దేవర 2 స్క్రిప్ట్ వర్క్ షూరూచేశాడట. ఆల్రెడీ ఆఫీస్ ఓపెనైంది. వర్క్ ఫ్లో పెరిగిపోయింది. ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డైరెక్టర్ కొరటాల శివ ఇచ్చిన అప్ డేట్.అంతే దెబ్బకి ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది. ఏ హీరో విషయంలో రూమర్స్ నిజమైనా కాకున్నా, ఎన్టీఆర్ విషయంలో, వరుసగా రూమర్స్ నిజమౌతున్నాయి
అన్నీ పాజిటివ్ రూమర్స్ అవటం, అవే రియల్ లైఫ్ లో జరుగుతుండటంతో, మిగతా రూమర్స్ కూడా నిజమౌతాయా అన్న డౌట్లు పెరిగాయి. ఒకటి డ్రాగన్ తర్వాత దేవర 2 పట్టాలెక్కడం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఆతర్వాత సందీప్ రెడ్డి వంగతో కూడా తన కాంబినేషన్ సెట్ అవుతుందా అన్న క్యూరియాసిటీ జనాల్లో పెరిగింది
ఐతే దేవర 2 విషయానికొస్తే, దేవర 1 తీసేప్పుడే దేవర 2 కథని రెడి చేశాడు కొరటాల శివ. అంతేకాదు మొదటి భాగం తీసేప్పుడే రెండో భాగం తాలూకు 15 శాతం షూటింగ్ కూడా జరిగిపోయింది. ఇక మీదట షూట్ చేస్తే మిగతా 85 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేయాలి..
ఇలాంటి టైంలో దేవర 2 స్క్రిప్ట్ వర్క్ షురూ అయ్యిందనగానే, అంటే కథ మారుతోందా? లేదంటే దేవర 2 మూవీ పనులు మొదలవుతున్నాయని ఇండికేట్ చేయటానికే కొరటాల శివ ఇలా చెప్పాడా అన్న డౌట్లు పెరిగాయి.
ఐతే వార్ 2 షూటింగ్ జనవరి 30 లోగా పూర్తయ్యేలా ఫిల్మ్ టీం షెడ్యూల్ ప్లాన్ చేస్తే, ఫిబ్రవరి నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ ఎంట్రీ కన్ఫామ్ అయ్యింది. ఐతే, సమ్మర్ లో మాత్రం దేవర 2 ని షురూ చేసేందుకు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడట. డ్రాగన్ తో ప్యార్ లల్ గా దేవర2 ని షూట్ చేసేందుకు రంగం సిద్దం అవటంతో, నిజంగానే ఎన్టీఆర్ విషయంలో వస్తున్న ప్రతీ పాజిటివ్ రూమర్ నిజమౌతున్నట్టే కనిపిస్తోంది
దీంతో సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా కూడా ఓకే అవుతుందనుకుంటున్నారు. స్పిరిట్, తర్వాత యానిమల్ పార్క్, ఆతర్వాత బన్నీ మూవీ తర్వాతే సందీప్ ఫ్రీ అవుతాడు కాబట్టి, అప్పటి వరకు ఎన్టీఆర్ తో సినిమా సెట్ అవుతుందనుకోలేం.. కాకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.కాబట్టే సందీప్, ఎన్టీఆర్ రెండు సార్లు కలుసుకున్నాక, వీళ్ల కాంబినేషన్ మీదే రూమర్లు పెరిగాయి.
ఏదేమైనా దేవర 2 కథ పనులు మొదలు పెట్టానంటూ కొరటాల శివ ఇచ్చిన అప్ డేట్ తో, ఎన్టీఆర్ సినిమాల ప్రోగ్రెస్ మీద అంచనాల భారం పెరుగుతోంది. ఏదేమైనా పుష్ప2 లో కథ మార్పులు జరిగినట్టే, దేవర 2 కథలో కూడా ముందనుకున్న దాంతో పోలిస్తే మార్పులు షురూ అయ్యాయి కాబట్టే, మళ్లీ పెన్ కి పని చెప్పాడట కొరటాల శివం.