Krithi Shetty: బేబమ్మ లక్ మారబోతుందా..? కృతి శెట్టి ఆశలన్నీ వంద కోట్ల సినిమాపైనే

కృతి శెట్టి కెరీర్ క్లోజ్ అయిందనుకున్న టైంలో ఊహించని విధంగా రూ.100 కోట్ల ప్రాజెక్ట్ పట్టేసి హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవితో కృతి శెట్టి జతకట్టబోతుంది. ఇటీవ‌ల `పొన్నియిన్ సెల్వన్ 2`తో జయం రవి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ అందుకున్నారు.

  • Written By:
  • Publish Date - December 5, 2023 / 08:13 PM IST

Krithi Shetty: ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఆ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించి పాత్ర పేరునే తన పేరుగా మార్చుకుంది. మరీ ముఖ్యంగా యూత్‌లో పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమా అంత పెద్ద హిట్టవ్వడానికి ఒక విధంగా కృతినే కారణం. అయితే, ఈ యంగ్ బ్యూటీకి గత కొంతకాలం నుంచి టైం బాగోలేనట్లుంది. చేసిన సినిమాలన్నీ వరుస ఫ్లాపులుగా నిలుస్తున్నాయి. దీంతో కెరీర్‌ను గాడిలో పెట్టుకునేందుకు తెగ కష్టపడుతుంది.

Dunki VS Salaar: నార్త్ ఇండియాలో సలార్‌కు డంకీతో చుక్కలేనా..?

కృతి శెట్టి కెరీర్ క్లోజ్ అయిందనుకున్న టైంలో ఊహించని విధంగా రూ.100 కోట్ల ప్రాజెక్ట్ పట్టేసి హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవితో కృతి శెట్టి జతకట్టబోతుంది. ఇటీవ‌ల `పొన్నియిన్ సెల్వన్ 2`తో జయం రవి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్ అందుకున్నారు. త‌న 32వ చిత్రాన్ని అతిపెద్ద తమిళ బ్యానర్ వేల్స్ ప్రొడక్షన్‌లో చేయ‌బోతున్నాడు. భువనేష్ అర్జునన్ దర్శకత్వంలో ‘జీనీ’ పేరుతో ఈ సినిమా రూపొందనుంది. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా నిర్మించ‌బోతున్నారు. అయితే ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా ఫిక్స్ అయింది.

జీనీ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌‌గా కనిపించబోతున్నారు. కళ్యాణి ప్రియదర్శన్‌, వామికతో పాటు ఈ సినిమాలో కృతి శెట్టి కూడా కనిపించబోతుంది. ఆమెకు ఈ సినిమా అయినా బూస్ట్ ఇచ్చి ఆఫర్లు తెచ్చి పెడుతుందా.. లేదా అనేది చూడాలి.