Pawan Kalyan: ఆ కుర్చీని మడత పెట్టి.. ఈ డైలాగ్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆ డైలాగ్ వినపడుతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఈ డైలాగ్‌ని గుంటూరు కారంలో వాడటంతో మరింత ఫేమస్ అయ్యింది. అసలు ఈ డైలాగ్ ఎలా వచ్చిందనే దానికంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా వాడతాడనే చాలామంది చర్చించుకుంటున్నారు. సహజంగా సోషల్ మీడియాలో ఎన్నో రీల్స్, చిన్న చిన్న వీడియోలు చూస్తుంటాం.
ALLU ARJUN-ATLEE: గెట్ రెడీ.. అల్లు అర్జున్‌తో అట్లీ.. త్వరలో ప్రకటన
కానీ అలాంటి రీల్‌లో ఒకడు “మా ఇంటికి వెళ్లగానే మడతపెట్టే ఇనుప కుర్చీ తీసుకుని కొడితే మెడ విరిగింది” అని చెప్పాడు. ఆయన చెప్పిన విధానం డిఫరెంట్‌గా ఉండటంతో అది కాస్తా వైరల్‌గా మారింది. మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమాలో ఆ డైలాగ్ ఎంతగానో వైరల్ అయింది. మొదట్లో ఈ పాట ప్రకటించినప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే, సోషల్ మీడియాలో దీన్ని ట్రోల్ చేసిన వారు థియేటర్లలో ఈ పాటను బాగా ఆస్వాదించారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ పాటను మళ్లీ మళ్లీ విన్నారు. అంతే కాకుండా అమెరికాలోని కొన్ని జిమ్ సెంటర్లలో జిమ్ కోచ్ ఈ పాటతో జుంబా డ్యాన్స్ వర్కవుట్ చేశాడు. ఇలాంటి పాటను ఆస్కార్ అవార్డ్‌కి పంపాలి అంటూ కొందరు ట్రోల్ చేసుకున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. ఇంతగా వైరల్ అవుతున్న ఈ డైలాగ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాడితే ఎలా ఉంటుంది? పబ్లిక్‌గా ఈ డైలాగ్‌తో స్పీచ్ ఇస్తుంటే అతడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించలేం. వేసవిలో ఆంధ్ర ఎన్నికల కారణంగా, ఈ డైలాగ్‌ను ఇప్పటికే చంద్రబాబు నాయుడు, సీఎం జగన్, నారా లోకేష్ తమ ప్రసంగాలలో పంచ్ డైలాగ్ లాగా ఉపయోగించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రసంగంలో కూడా ఈ డైలాగ్ ఉండొచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి.