Poonam Pandey: చనిపోవడానికి గంటల ముందు పార్టీ.. కన్నీళ్లు పెట్టిస్తోన్న పూనమ్‌ చివరి పోస్ట్‌..

పూనమ్ ఇక లేదు అన్న వార్త.. ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. పూనమ్‌ను సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే ఎవరు అయినా సరే.. ఆమె చనిపోయింది అంటే నమ్మలేని పరిస్థితి. చనిపోవడానికి మూడు రోజుల ముందు కూడా గోవాలో ఓ పార్టీలో పాల్గొంది పూనమ్‌.

  • Written By:
  • Updated On - February 2, 2024 / 06:41 PM IST

Poonam Pandey: పూనమ్‌ పాండే.. విషయం కంటే వివాదాలు ఎక్కువ. లైమ్‌లైట్‌లో ఉండేందుకు ఎలాంటి మాటలైనా చెప్తుంది. ఎలాంటి సాహసమైనా చేస్తుంది. అందుకే ఆమె చనిపోయింది అన్నా సరే.. అన్నీ క్వశ్చన్‌ మార్క్‌లే కనిపించాయ్ తప్ప.. కన్ఫార్మ్‌ చేయలేకపోయారు ఎవరూ ! గర్భాశయ క్యాన్సర్‌తో చికిత్స తీసుకుంటూ చనిపోయిందంటూ పూనమ్‌ పాండే పీఆర్‌ టీమ్‌.. ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

Poonam Pandey: బాలీవుడ్‌లో విషాదం.. సర్వైకల్‌ క్యాన్సర్‌తో పూన‌మ్ పాండే మృతి

పూనమ్ పాండే ప్రముఖ మోడల్‌గా గుర్తింపు పొందారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు.. భారత్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే బట్టలు విప్పి తిరుగుతానని కామెంట్‌ చేసి దుమారం రేపారు. 2013లో నషా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పూనమ్‌.. తెలుగులో మాలిని అండ్ కో అనే మూవీలో నటించింది. సినిమాల కంటే ఎక్కువ వివాదాస్పద వ్యాఖ్యలతోనే పూనమ్‌ వార్తల్లో నిలిచింది. ఢిల్లీలో జన్మించిన పూనమ్‌ అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో ఆమె నిలిచి వాల్డ్‌వైడ్‌గా గుర్తింపు పొందింది. ఇదంతా ఎలా ఉన్నా.. పూనమ్ ఇక లేదు అన్న వార్త.. ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. పూనమ్‌ను సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే ఎవరు అయినా సరే.. ఆమె చనిపోయింది అంటే నమ్మలేని పరిస్థితి. చనిపోవడానికి మూడు రోజుల ముందు కూడా గోవాలో ఓ పార్టీలో పాల్గొంది పూనమ్‌.

వైట్ టాప్‌, బ్లాక్ ప్యాంట్‌లో.. టీమ్‌తో కలిసి యాచ్‌లో జరిగిన పార్టీకి పూనమ్‌ వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ కింద.. పూనమ్‌ పెట్టిన రాతలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. తను వేసుకొచ్చిన డ్రెస్‌ కలర్‌ వైట్ అండ్ బ్లాక్‌ చెప్తూ.. చైనీస్ కోట్‌ యిన్ అండ్ యాంగ్‌ను రాసుకొచ్చింది. ఒకదానికొకటి విరుద్ధంగా కనిపించే భావనను చెప్పేలా యిన్ అండ్‌ యాంగ్‌ ఉపయోగిస్తారు. బతుకు ఒకటి.. బతుకుతున్నది ఒకటి అనే సెన్స్‌ వచ్చేలా ఉంటుంది. చనిపోవడానికి సరిగ్గా మూడు రోజుల ముందు.. పూనమ్‌ ఇలాంటి పోస్ట్ పెట్టడం.. ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది.