Lavanya Tripathi: కోట్లాది మంది భక్తుల కల నెరవేరింది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. దివ్వ ముహుర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ జరిగింది. వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. తాజాగా అయోధ్య గురించి కొణిదెల కోడలు లావణ్య త్రిపాఠి చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరగ్గా.. దేశం మొత్తం భక్తి భావంతో నిండిపోయింది.
Ram Charan: జై హనుమాన్‌లో రామ్ చరణ్
సినీ ప్రముఖులతో పాటు ప్రజలంతా ఆ చారిత్రాత్మక కల నేరవేరిందని గుర్తు చేస్తూ పోస్ట్ పెట్టారు. లావణ్యత్రిపాఠి కూడా అయోధ్య రామ మందిరం గురించి ఎమోషల్ పోస్ట్ చేసింది. తాను కూడా జన్మించింది అయోధ్యలోనే అని కామెంట్స్ చేసింది. అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపన జరగడాన్ని తాను ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు రాసుకొచ్చింది. బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురష్కరించుకుని మెగా కోడలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. శ్రీరాముడి పట్టాభిషేకానికి సంబంధించిన మెడ నగను ధరించారు. ఆ నగ బంగారు వర్ణంలో.. మధ్యలో శ్రీరామ పట్టాభిషేక దృశ్యంలో లలిత లావణ్యంగా ఉంది. లావణ్య మెడలో ఆ నగ అందంగా ఒదిగిపోయింది.
మెడ నగకు తగ్గట్టుగా ఆమె చెవులకు బుట్ట కమ్మలు మరింత శోభ తెస్తూ ఉన్నాయి. నగ తాలూకా ఫొటోలు స్వయంగా లావణ్య త్రిపాఠి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. అయోధ్యలో పుట్టినదానిగా.. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూసి సంతోషిస్తున్నానని, ఇది ప్రతీ భారతీయుడు గర్వించదగ్గ సంగతి అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.