Lavanya Tripathi: ఎంగేజ్‌మెంట్‌లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర ధర తెలిస్తే షాకవ్వాల్సిందే..

ఈ ఎంగేజ్‌మెంట్‌‌లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర అందరినీ ఆకర్షించింది. సాధారణంగానే సెలబ్రెటీస్‌ వేసుకునే బట్టలు చాలా కాస్ట్లీగా ఉంటాయి. స్పెషల్‌గా డిజైన్‌ చేసిన బట్టలనే వేసుకుంటారు చాలా మంది. ఇక ఏదైనా ఫంక్షన్‌ లేదా ఈవెంట్‌ ఉంటే వాళ్లు వేసుకునే బట్టల ధర లక్షలు.. అప్పుడప్పుడూ కోట్లలో కూడా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 10, 2023 / 01:04 PM IST

Lavanya Tripathi: ఇన్నాళ్ల నుంచి తమ లవ్‌ను సీక్రెట్‌గా ఉంచిన మెగా ప్రిన్స్‌ వరుణ్‌, లావణ్య త్రిపాఠి ఇప్పడు ఎంగేజ్‌మెంట్‌తో దాన్ని అఫీషియల్‌ చేశారు. మెగా, అల్లు, లావణ్య కుటుంబ సభ్యుల మధ్య వీళ్ల ఎంగేజ్‌మెంట్‌ చాలా గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ ఎంగేజ్‌మెంట్‌‌లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర అందరినీ ఆకర్షించింది.

సాధారణంగానే సెలబ్రెటీస్‌ వేసుకునే బట్టలు చాలా కాస్ట్లీగా ఉంటాయి. స్పెషల్‌గా డిజైన్‌ చేసిన బట్టలనే వేసుకుంటారు చాలా మంది. ఇక ఏదైనా ఫంక్షన్‌ లేదా ఈవెంట్‌ ఉంటే వాళ్లు వేసుకునే బట్టల ధర లక్షలు.. అప్పుడప్పుడూ కోట్లలో కూడా ఉంటుంది. ఇప్పుడు లావణ్య కట్టుకున్న చీర గురించి కూడా అలాంటి టాపిక్‌ మొదలైంది. ఈ ఫంక్షన్‌లో లావణ్య కట్టుకున్న చీర ధర రూ.75 వేలు. అనితా డోంగ్రె అనే ఫ్యాషన్‌ డిజైనర్‌ దీన్ని డిజైన్‌ చేశారు. ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో కూడా పోస్ట్‌ చేశారు. అకేషన్‌కు తగ్గట్టుగా చాలా సింపుల్‌గానే ఉన్నా.. అందరినీ చాలా అట్రాక్ట్‌ చేసింది ఈ శారీ. లైట్ గ్రీన్ కలర్‌లో ఉన్న ఈ పట్టు చీర మెరిసిపోతుండగా లావణ్య ఇందులో మరింత అందంగా కనిపించింది.

అయితే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి చీరల ధరతో పోలిస్తే ఇది తక్కువే అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నిశ్చితార్థానికి 75 వేల రూపాయల చీర కట్టింది అంటే పెళ్ళికి కచ్చితంగా లక్ష రూపాయలు దాటుతుంది అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.