Game Changer: భారీ సినిమాలకు లీకేజీల బెడద.. నిర్మాతల పరేషాన్..!

ఔట్‌‌డోర్‌లో షూటింగ్‌ అంటే.. జనాలు సెల్‌ఫోన్స్‌లో బంధించి లీక్‌ చేస్తూ వుంటారు. అయితే.. గేమ్‌ ఛేంజర్‌ విషయంలో ఎడిటింగ్ టేబుల్‌ నుంచే పాట లీక్‌ కావడం షాక్‌ ఇచ్చింది. రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబోలో రూపొందుతున్న పొలిటిక్‌ మూవీ 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌ కావడానికి ఇంకా ఏడాది టైం వుంది.

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 06:55 PM IST

Game Changer: అదేమిటోగానీ.. కట్టుదిట్టంగా భారీ సెక్యూరిటీ మధ్య షూట్‌ చేసే శంకర్‌, రాజమౌళి సినిమాలే ఎక్కువగా లీక్‌ అవుతూ వుంటాయి. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ అయిందో లేదో.. ఏకంగా పాటలో కొంత భాగం బైటకొచ్చేసింది. ఈ లీక్‌ను మేకర్స్‌ సీరియస్‌గా తీసుకుని.. కేసు పెట్టారు. నిజానికి శంకర్ సినిమాలను లీకేజ్‌లు వెంటాడుతూనే వుంటాయి. రోబో 2.0 షూటింగ్‌ టైంలో ఫొటోలు, వీడియోలు బైటకొచ్చి శంకర్‌ను ఇబ్బందిపెట్టాయి.

ఔట్‌‌డోర్‌లో షూటింగ్‌ అంటే.. జనాలు సెల్‌ఫోన్స్‌లో బంధించి లీక్‌ చేస్తూ వుంటారు. అయితే.. గేమ్‌ ఛేంజర్‌ విషయంలో ఎడిటింగ్ టేబుల్‌ నుంచే పాట లీక్‌ కావడం షాక్‌ ఇచ్చింది. రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబోలో రూపొందుతున్న పొలిటిక్‌ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ కావడానికి ఇంకా ఏడాది టైం వుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్‌ ఇస్తున్నాడు. ”జరగండి.. జరగండి’ అంటూ సాగే పాట ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. సాంగ్‌ లీక్‌ కావడంతో దిల్‌ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. పాటను లీక్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సోషల్‌ మీడియాలో ఈ పాటను షేర్‌ చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు దిల్‌ రాజు. సెట్‌లో లీకేజ్‌ అంటే కనిపెట్టడం కష్టమే.

కానీ, బయటి షూటింగ్‌లో ఎవరు సెల్‌ఫోన్‌తో తీశారో తెలుసుకోవడం కష్టం. అయితే, గేమ్‌ ఛేంజర్‌ సాంగ్‌ లీక్‌ అంటే కచ్చితంగా ఇంటిదొంగ పనే అంటున్నారు. లీకైంది రఫ్‌ వెర్షన్‌ మత్రమేనని.. ఫైనల్ సాంగ్ కాదంటున్నారు. ఏదైనా.. తమన్‌ కాంపౌండ్‌ నుంచి బైటకొచ్చిందా..? ప్రొడక్షన్‌ హౌస్‌ నుంచి వచ్చిందో తెలియాల్సి వుంది.