Lokesh Kanagaraj: సూపర్ స్టార్ రజినీకాంత్ చివరి సినిమా తీసేది లోకేష్ కనకరాజ్ అంటున్నారు. తను విక్రమ్ 2 లేదంటే ఖైదీ 2 తీయాల్సిన దర్శకుడు. కాని లియో తర్వాత సడన్‌గా రజినీకాంత్ మూవీ ప్లాన్ చేయటానికి రీజన్.. తన లాస్ట్ మూవీ అదిరిపోయేలా ఉండాలనేది సూపర్ స్టార్ రజినీ కోరిక. అలా తెరకెక్కబోతున్న ఈప్రాజెక్ట్‌కి, తన గత చిత్రాల సినిమాటిక్ యూనివర్స్‌కి ఎలాంటి లింక్ లేదన్నాడు లోకేష్. మరోవైపు.. లియో 2 ఉందని తేల్చి షాక్ ఇచ్చాడు లోకేష్.
Aashiqui 3: ఆ హీరో రెండో ప్రేయసి, ఇప్పుడు మూడో ప్రేయసిగా మారిందా..?
కోలీవుడ్‌లో మరో స్టార్ హీరో.. దళపతి విజయ్‌తో లోకేష్ ఆల్రెడీ మాస్టర్, లియో అంటూ రెండు సినిమాలు తీశాడు. బాక్సాఫీస్‌ని రెండు సార్లు షేక్ చేశాడు. అలాంటి తను ఇప్పుడు లియో 2 అనగానే షాక్ అవటానికి కారణం.. రాజకీయాల్లోకి వెళుతున్న విజయ్ చివరి మూవీ గోట్ అని ఎనౌైన్స్ అవటం. ఆల్రెడి వెంకట్ ప్రభు మేకింగ్‌లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ చేస్తున్నాడు విజయ్. అదే తన చివరి చిత్రం అని, ఈమధ్యే తను పార్టి పెట్టి రాజకీయాల్లోకి దిగుతున్నానని చెప్పిన సందర్భంలో తేల్చాడు. కట్ చేస్తే లియో సీక్వెల్ లియో 2 తెరపైకొచ్చింది. అక్కడే ట్విస్ట్ ఉంది. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లి ఎలక్షన్స్‌కి తను పోటీ పడతానన్నాడు. కాబట్టి ఈలోపు అంటే 2024, 2025లో కనీసం రెండు సినిమాలు చేస్తాడని తెలుస్తోంది.
గోట్ తర్వాత లియో 2 చేసి, అలా కెరీర్‌కి గుడ్ బై చెబుతాడట. అంటే లోకేష్ కనకరాజ్ మేకింగ్‌లో రజినీకాంత్ మూవీ తీసిన వెంటనే సూపర్ స్టార్ కెరీర్‌కి గుడ్ బై చెబుతాడు. విజయ్‌తో లియో 2తీయగానే దళపతి కూడా కెరీర్‌కి గుడ్ బై చెబుతాడా..? ఇది ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న.