LEO Vs PUSHPA 2: లియో మూవీతో పుష్పకి లింక్ సింక్ అవుతోంది. లోకేష్ కనకరాజ్ వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టకపోతే, ఆ రికార్డుని లెక్కల మాస్టర్ సుకుమార్ సొంతం చేసుకునేలా ఉన్నాడు. ఒకరు తమిళ్ డైరెక్టర్, మరొకరు తెలుగు డైరెక్టర్. ఒకరితో ఒకరిని పోల్చలేం. అలాని పోల్చకుండా ఉండలేం. అక్కడే అసలు కిటుకుంది. అసలు మ్యాటర్ ఏంటంటే సౌత్ నుంచి వెయ్యికోట్ల ఫీట్ ని సొంతం చేసుకుంది ఇద్దరే దర్శకులు. బాహుబలి 2 తో 1800 కోట్లు రాబట్టిన రాజమౌళి, కేజీయఫ్ 2 తో 1200 కోట్లు రాబట్టిన ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరు సౌత్ నుంచి రూ.వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాల దర్శకులు.
రాజమౌలి అయితే బాహుబలి 2 తో 1800 కోట్లు, త్రిబుల్ ఆర్ తో 1200 కోట్లు మొత్తంగా 3000 కోట్ల దర్శకుడిగా మారాడు. ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2 తో 1200 కోట్లు రాబట్టాక, సలార్‌తో ఈ డిసెంబర్‌లో మరోసారి థౌజెండ్ వాలాని పేల్చబోతున్నాడు. జక్కన్న తర్వాత రెండు సార్లు థౌజెండ్ వాలాలు పేల్చిన ఘనత ప్రశాంత్ నీల్‌కి దక్కనుంది. ఈ విషయంలో తెలుగు దర్శకుడు, కన్నడ డైరెక్టర్ ఈ రేర్ ఫీట్ ని సాధిస్తే, తమిళ్ నుంచి ఫస్ట్ టైం థౌజెండ్ వాలా పేల్చేందుకు లియోతో ఈ దసరాకు ముహుర్తం చూసుకున్నాడు లోకేష్ కనకరాజ్. విజయ్ దళపతికి నార్త్ లో వసూళ్ల వర్షం కురిపించేంత మార్కెట్, క్రేజ్ లేవు.
కాని ఖైదీ, విక్రమ్ తో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి క్రేజ్ ఉంది. లియో ఏమాత్రం వర్కవుట్ అయినా వెయ్యికోట్ల సినిమాగా మారే అవకాశం ఉంది.ఒకవేళ ఈ దసరాకు లియో వెయ్యికోట్ల వసూళ్లు రాబట్టేమూవీగా మారకపోతే, సలార్ వెయ్యికోట్ల సునామీ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ ఎకౌంట్లో రెండో వెయ్యికోట్ల మూవీ పడుతుంది. కాని, థౌజెండ్ వాలా పేల్చిన దర్శకుల లిస్ట్ లో కొత్త దర్శకుడి పేరు చేరదు. అలా చేరాలంటే వచ్చే ఏడాది ఆగస్స్ 15 వరకు వేయిట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే పుష్ప 2 రాబోతోంది. పుష్ప 1 మూవీ రూ.400 కోట్లు పైనే వసూళ్లు రాబట్టింది.
కాబట్టి బాహబలి1, తర్వాత 2, కేజియఫ్ 1, తర్వాత 2 వచ్చి వెయ్యికోట్లు రాబట్టినట్టు పుష్ప 2 థౌజెండ్ వాలాగా మారొచ్చు. మరి మధ్యలో కల్కి, దేవర మూవీలున్నాయి కదా అంటే.. కల్కి వాయిదాకే ఛాన్స్ ఎక్కువ. దేవర మొదటి మూవీ కాబట్టి కొరటాల శివ థౌజెండ్ వాలాగా మారుతాడనేది నమ్మకం తక్కువ.. సో ఈ అంచనానే కరెక్ట్ అయితే లియో వెయ్యికోట్లు రాబట్టకపోతే, పుష్ప 2 తో సుకుమారే థౌజెండ్ వాలాగా మారే అవకాశం ఎక్కువ.
LEO Vs PUSHPA 2.. WHICH MOVIE WILL ENTER INTO 1000 Cr CLUB