Rashmika : కాస్తలో ప్రాణం పోయేది.. తప్పించుకున్నాం.. రష్మిక షాకింగ్‌ పోస్ట్‌

యానిమల్ (Animal) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టింది.

యానిమల్ (Animal) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టింది. అయితే వ‌రుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న రష్మికకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఆమె తృటిలో విమాన ప్రమాదం నుంచి తప్పించుకుంది. రష్మిక ఇటీవల ముంబయి నుంచి హైదరాబాద్‌కి విమానంలో వచ్చింది. రష్మిక (Rashmika) ప్రయాణిస్తున్న విమానంలో టెక్నికల్‌ సమస్య ఏర్పడడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. విమానం సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కాకుండా కాస్త హార్షగా ల్యాండ్‌ అయ్యింది.

ఈ ఘటనతో రష్మిక ఎంతో కంగారు పడింది. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.ఈ ఇన్సిడెంట్‌ జరిగినప్పుడు అదే ఫ్లైట్‌లో మరో హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌ కూడా ఉంది. ఆమె కూడా ప్రాణం పోయనంతగా భయపడిపోయిందట. ఈ విషయాన్ని రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఫ్లైట్‌ ల్యాండ్‌ అవుతున్న సమయంలో సీట్లను గట్టిగా పట్టుకొని కూర్చున్న ఫొటోలను ఇన్‌స్టగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇలా మేం ఇవాళ బతికిపోయాం లేదంటే ఏమయ్యేదో అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ ప్రమాదంలో తమకేం కాలేదని.. ఇద్దరం సేఫ్‌గానే ఉన్నామంటూ ఇద్దరూ సెల్ఫీ తీసుకుని పోస్ట్‌ చేశారు. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. రష్మిక, శ్రద్ధా ఫ్యాన్స్‌ అంతా థాంక్‌ గాడ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.