Line Man Telugu Movie: లైన్‌మెన్ కత్తిరిస్తే.. కరెంట్ షాకేనా..?

గుడ్లకి, కరెంట్ కట్ కాన్సెప్ట్‌కి ఉన్న లింక్ కదిలించేలా చేస్తుంది. ఓవరాల్‌గా హీరోతోపాటు అంతా పాత్రలో పాతుకపోతే, సెకండ్ హాఫ్ స్లో అన్న కామెంట్స్ వల్ల సినిమాకు కాస్త మిక్స్డ్ డ్ టాక్ వస్తోంది. కాని ఓవరాల్ గా మ్యూజిక్ పరంగా, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తోపాటు నెరేషన్ పరంగా సినిమాకు మంచి మార్కులే పడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 08:40 PM IST

Line Man Telugu Movie: లైన్‌మెన్ ఏం చేస్తాడు..? కరెంట్ కట్ చేస్తాడు. లేదంటే కరెంట్ కనెక్ట్ చేస్తాడు. రిపేర్లుంటే చేస్తాడు. అలాంటి పాత్రని హీరోగా పెట్టి ఫిలాసఫీ క్లాస్‌ని మేసేజ్ ఇచ్చే కోణంలో చెబితే.. అదే లైన్‌మెన్ స్టోరీ. తెలుగులో కథ, కొండ బయోపిక్, పీఎస్‌వీ గరుడ వేగ లాంటి సినిమాలతో ఫోకస్ అయిన హీరో త్రిగుణ్ . అలాంటి తనో తమిళ్, తెలుగు భాషల్లో తీసిన మూవీ లైన్‌మెన్. ఈ సినిమా మెయిన్ పాయింట్ విషయానికొస్తే, వందల మందికి పురుడు పోసే ముసలమ్మ వయసు 99 దాటుతుంది.

RAM CHARAN: చరణ్‌తో బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్న సుకుమార్

ఇక తన వందో బర్త్ డేని సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తారు అక్కడి జనం. కాని అదేరోజు లైన్ మెన్ కరెంట్ కట్ చేస్తాడు. ఎవరెన్ని చెప్పినా కరెంట్ కనెక్ట్ చేయనంటాడు. ఎవరినీ ఆ పనిచేయనివ్వనంటాడు. తను ఎందుకలా చేశాడో అదే అసలు కథ. గంట కరెంట్ పోతేనే ప్రాణాలు పోయినట్టు చేస్తారు. టీవీ రాదు, ఇంటర్నెట్ ఉండదు. టవర్‌లో కరెంట్ పోతే, సిగ్నల్ ఉండదు కాబట్టి ఫోన్ పనిచేయదు.. ఇలా అన్నీ ఆగిపోతే ఊరిజనం, ఊరుకుంటారా? ఊరుకోరు, మరేం చేస్తారు. చిన్న పాటి రెవెల్యూషన్ వస్తుంది. కాని టెక్నాలజీ పేరుతో జనాలు ఫోన్లకు టీవీలకు దగ్గరై, ఒకరికొకరు దూరమయ్యారనే సందేశాన్ని అర్ధమయ్యేలా చేసేందుకు హీరో ఏం చేశాడు. గుడ్లకి, కరెంట్ కట్ కాన్సెప్ట్‌కి ఉన్న లింక్ కదిలించేలా చేస్తుంది.

ఓవరాల్‌గా హీరోతోపాటు అంతా పాత్రలో పాతుకపోతే, సెకండ్ హాఫ్ స్లో అన్న కామెంట్స్ వల్ల సినిమాకు కాస్త మిక్స్డ్ డ్ టాక్ వస్తోంది. కాని ఓవరాల్ గా మ్యూజిక్ పరంగా, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తోపాటు నెరేషన్ పరంగా సినిమాకు మంచి మార్కులే పడుతున్నాయి. లైన్ మెన్ కరెంట్ కట్ చేశాక షాక్ కొట్టే ఛాన్సే లేదు. కాబట్టి లైన్ మెన్ మూవీ గట్టెక్కినట్టే అనుకోవాలి. కాకపోతే కలెక్సన్స్ పరంగా కట్స్ లేకుంటేనే లాభాలకు ఛాన్స్ఉంది.