Prabhas: రెబల్ స్టార్‌ని కూడా వాడేస్తున్న లోకేష్ కనకరాజ్..!

అసలు ప్రభాస్‌తో లోకేష్ ప్లాన్ చేసిన మూవీ పట్టాలెక్కాలంటే రెండేళ్లు పడుతుంది. అంటే 2025 వరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ లేదు. అలాంటిది ఇప్పడే ఎందుకు లోకేష్ ఇలా ప్రభాస్‌తో తను తీయబోయే సినిమా గురించి రివీల్ చేస్తున్నాడు..?

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 07:03 PM IST

Prabhas: ఖైదీ, విక్రమ్ ఫేం లోకేష్ కనకరాజ్ ఇప్పుడు ప్రభాస్ సినిమా గురించి బాంబు పేల్చాడు. రెబల్ స్టార్‌తో లోకేష్ తీయబోయే సినిమా తన సినిమాటిక్ యూనివర్స్‌తో లింక్ ఉండదన్నారు. కొత్త కాన్సెప్ట్.. సరికొత్త కంటెంట్‌తో ప్రభాస్ మూవీ ప్లాన్ చేస్తానన్నాడు. అసలు ప్రభాస్‌తో లోకేష్ ప్లాన్ చేసిన మూవీ పట్టాలెక్కాలంటే రెండేళ్లు పడుతుంది. అంటే 2025 వరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ లేదు. అలాంటిది ఇప్పడే ఎందుకు లోకేష్ ఇలా ప్రభాస్‌తో తను తీయబోయే సినిమా గురించి రివీల్ చేస్తున్నాడు..? ఇన్ని అప్‌డేట్స్ ఎందుకిస్తున్నాడు..?

ఈ ప్రశ్నలకు సమాధానం లియో మూవీ ప్రమోషన్. విజయ్ దళపతికి తమిళ్‌లో ఉన్నంత క్రేజ్ తెలుగులో లేదు. కాని విజిల్ నుంచి మాస్టర్ వరకు వరుస హిట్ల వల్ల తెలుగులో రూ.20 కోట్లకు పైనే మార్కెట్ వచ్చింది. అయినా తెలుగులో లియో మూవీ సందడి చేయాలంటే విజయ్ క్రేజ్ సరిపోదు. అందుకే ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఐస్ చేసుకునేందుకు ప్రభాస్‌తో తను తీయబోయే సినిమా గురించి లోకేష్ అప్‌డేట్స్ ఇస్తున్నాడు అంటున్నారు. మొన్నటి వరకు రామ్ చరణ్ స్పెషల్ అప్పియరెన్స్ అన్నారు. అది రూమర్ అని తేలినా, ఇంతవరకు ఆ మ్యాటర్ టచ్ చేయలేదు లోకేష్. ఇప్పడు ప్రభాస్ పేరు లేవనెత్తాడు. ఇవన్నీ చూస్తే లియోని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ప్రమోట్ చేసేందుకు తెలుగు హీరోలని కూడా వాడేస్తున్నాడని అనుకోవాల్సి వస్తోంది.