ఇండియన్ సినిమాలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనేది ఓ సెన్సేషన్. ఆ కాన్సెప్ట్ దెబ్బకు బాలీవుడ్ హీరోలు షేక్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్నో సినిమాలు చేసారు గాని ఈ రేంజ్ కాన్సెప్ట్ ఎప్పుడూ రాలేదు. ఓ సాదా సీదా స్టార్ హీరోతో కాన్సెప్ట్ మొదలుపెట్టి… అగ్ర హీరోలతో బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ కు వెళ్ళాడు. ఖైదీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోకేష్… ఆ తర్వాత విక్రమ్ తీసాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ రెండు సినిమాలకు లింక్ ఉందని క్లైమాక్స్ లో చూపించాడు విక్రమ్ సినిమాలో.
ఇప్పుడు లోకేష్ కూలీ, ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు ప్లాన్ చేసాడు. ఇవన్నీ ఎల్సీయూలో భాగమే. కూలీ సినిమాపై డౌట్ ఉన్నా… ఖైదీ 2 వచ్చే ఏడాది రానుంది. ఆ తర్వాత రోలెక్స్ సినిమా రానుంది. విక్రమ్ లో రోలెక్స్ రోల్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో రోలెక్స్ ప్లాన్ చేసాడు లోకేష్. డ్రగ్స్ గ్యాంగ్ కు రోలెక్స్ లీడర్ ఎలా అయ్యాడు అనేది ఆ సినిమాలో చూపిస్తాడు. ఆ తర్వాత విక్రమ్ సీక్వెల్ రానుందని టాక్. ఆ తర్వాత ఎల్సీయూలో ఉన్న హీరోలు అందరితో ఓ సినిమా చేయనున్నాను అని లోకేష్ ప్రకటించాడు.
5 ఏళ్ళ పాటు ఈ కాన్సెప్ట్ పైనే సినిమాలను ప్లాన్ చేసాడు. అయితే ఎల్సీయుని గ్రాండ్ గా ప్లాన్ చేయడానికి లోకేష్ తెలుగు హీరోలను కూడా భాగం చేయాలని భావిస్తున్నాడు. ఇందుకోసం ఎన్టీఆర్, ప్రభాస్ తో ఇప్పటికే చర్చలు జరిపినట్టు టాక్. అయితే ఎన్టీఆర్ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం, బాలీవుడ్ పై ఫోకస్ చేయడంతో సాధ్యం కాదని చెప్పాడట. కాని ప్రభాస్ అంతకు మించి బిజీగా ఉన్నా సరే ఓకే చేసినట్టు టాక్. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కీ 2, సలార్ 2 సినిమాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో తన డ్రీం ప్రాజెక్ట్ ను ప్రభాస్ తో చేయడానికి కథ వినిపించాడు. ప్రభాస్ కూడా అందుకు ఓకే చెప్పేసాడు. దాదాపుగా ఈ సినిమాను రిల్ రాజు నిర్మించే ఛాన్స్ ఉందని టాక్. అయితే ప్రభాస్ 2026 చివరి వరకు బిజీగా ఉన్నాడు. మరి ఆ తర్వాత ఈ సినిమా ఉంటుందా లేకపోతే కూలీ, ఖైదీ తర్వాత చేస్తాడా అనేది క్లారిటీ రావడం లేదు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసే ఛాన్స్ కనపడుతోంది. ఇది గనుక వర్కౌట్ అయితే మాత్రం కచ్చితంగా చరిత్ర సృష్టించినట్టే.