LCU అభిమానులకు లోకేశ్ కనగరాజ్ షాక్..

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanakaraj) డైరెక్టర్లలో ఇప్పుడొక ట్రెండ్ సెట్టర్. బడా హీరోలను డైరెక్ట్ చేస్తూ.. వారికి మాస్ హిట్స్ ఇస్తూ టాక్ ఆఫ్ ది ఇండ్రస్టీ అయ్యాడు. దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించిన సమయంలోనే.. ఫ్యూచర్ మూవీస్, కథలు సిద్ధం చేసుకున్న ఈ సునామీ డైరెక్టర్.. వాటిని స్క్రీన్ పై అప్లై చేస్తూ.. అభిమానులకు షాక్‌కు గురి చేస్తున్నాడు.

లోకేష్ కనగరాజ్ (Lokesh Kanakaraj) డైరెక్టర్లలో ఇప్పుడొక ట్రెండ్ సెట్టర్. బడా హీరోలను డైరెక్ట్ చేస్తూ.. వారికి మాస్ హిట్స్ ఇస్తూ టాక్ ఆఫ్ ది ఇండ్రస్టీ అయ్యాడు. దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించిన సమయంలోనే.. ఫ్యూచర్ మూవీస్, కథలు సిద్ధం చేసుకున్న ఈ సునామీ డైరెక్టర్.. వాటిని స్క్రీన్ పై అప్లై చేస్తూ.. అభిమానులకు షాక్‌కు గురి చేస్తున్నాడు. ఒక సినిమాను మరో మూవీతో లింక్ చేస్తూ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అనే కొత్త పోకడను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. 2016లో అవియల్ అనే మూవీతో దర్శకుడిగా పరిచమయ్యాడు ఈ యంగ్ టాలెంట్. కానీ అతడికి గుర్తింపు వచ్చింది మాత్రం ఖైదీతోనే.. విక్రమ్, ఇటీవల వచ్చిన లియో ఇండస్ట్రీకి మరో హిట్ అందించాడీ దర్శకుడు. ఈ మూడు సినిమాలు ఎల్‌సియులో భాగమే.

ఇది కూడా చదవండి Sreeleela: వహ్వా శ్రీలీల.. ఆ సీన్స్ చేయనన్న శ్రీలీల.. అందుకే ఔట్

లియో సక్సెస్ తర్వాత ఆయన తదుపరి సినిమా పై దృష్టి సారించాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తన తదుపరి మూవీ కోసం ఈ‌గర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందులో ఉండే సినిమాటిక్ యూనివర్స్ ఏంటోనని ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ సర్య్కులేట్ అవుతుంది. అదే ఆయన ఇక LCU సినిమాలు చేయడని. ఆ బాధ్యతను తన అసిస్టెంట్లకు అప్పగించాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే తన మల్టీవర్ స్టోరీస్‌ను అసిసెంట్ డైరెక్టర్ల భుజాన వేస్తున్నాడట లోకేశ్. ఖైదీ 2 (Khaidi 2) , విక్రమ్ 2 (Vikram 2) మూవీస్‌ను తెరకెక్కించే బాధ్యతలను ఆయన దగ్గర పనిచేస్తున్న సహాయ దర్శకులకు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : VIRAT KOHLI: బయోపిక్స్ ట్రెండ్.. విరాట్ కోహ్లీ బయోపిక్‍..! హీరో ఎవరంటే.

10 సినిమాలు తీసిన తర్వాత రిటైర్ మెంట్ తీసుకుంటానని గతంలోనే ప్రకటించిన లోకేష్.. ఇప్పుడు ఎల్‌సియులో భాగమైన మూవీలను సహాయ దర్శకులకు ఇస్తున్నాడన్న న్యూస్ ను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖైదీ, విక్రమ్, లియో మూవీస్ తో మాస్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్న ఈ డైరెక్టర్.. నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. బడా హీరోలతో మూవీలు తీస్తూ.. ఇంటర్ లింక్ కనెక్షన్ పెడుతూ.. వారందిరినీ మళ్లీ తన చిత్రంతోనే ఒకేసారి తెరపైకి తెస్తాడనుకుంటున్న సమయంలో LCUలో సినిమాలు తీయడన్న వార్త ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.