కల్కీ నడుస్తున్నంత సేపు సౌత్, నార్త్ లో మరో మూవీ చర్చే లేదు. అలానే దేవర దండయాత్ర కొనసాగుతున్నంత సేపు, పాన్ ఇండియా లెవల్లో మరో సినిమా గురించి డిస్కర్షనే రాలేదు. ఒక వేల ఏదైనా మూవీ విడుదలైతే, ఫ్లాప్ అవటమో, డిజాస్టరని తేలటమో జరిగేవి… జూన్ నుంచి పాన్ ఇండియా లెవల్లో ఇదేజరుగుతోంది. కట్ చేస్తే ఇంతకాలానికి దేవర దరువుని తట్టుకుని ఓ సినిమా హిట్ మెట్టెక్కింది. అది కూడా మామూలు హిట్ కాదు. సాలిడ్ హిట్ గా మొదటి ఆటతోనే వసూళ్ల వేట షురూచేసింది. ఇంతకి ఏంటా సినిమా…? ఈ వారం లక్కీ బాస్కర్ విడుదలైంది. క టైటిల్ తో కిరణ్ అబ్బవరం దండయాత్ర కనిపించింది. అమరన్ తో శివ కార్తికేయన్ దాడి జరిగింది.. ఈ ముగ్గురిలో దేవర దరువుని తట్టుకుని నిలబడిందెవరు? చాలా కాలం తర్వాత అది కూడా దేవర తర్వాత తెలుగులో వెలిగిన మరో మూవీఅంటే సెన్సేషనే… ఆ సెన్సేషన్ పేరేంటి?
దేవర దరువుకి హిందీలోజిగ్రా ప్లాపైంది. తమిళ్ లో వెట్టయాన్ కొట్టుుకుపోయింది. అలాంటి ఊర మాస్ మూవీ దూకుడికి పెద్ద హీరోలు, హీరోయిన్లే తట్టుకోలేకపోయారు.. ఇక మీడియం రేంజ్ స్టార్లేం తట్టుకుంటారు. అందుకే రెండు నెలలుగా పాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ మొత్తం వార్ వన్ సైడ్ అయ్యింది. కాని ఈ వారం లెక్క మారింది.
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క మూవీలొచ్చాయి. పోటీగా తమిళ డబ్బింగ్ మూవీ అమరన్ వచ్చింది. ఈమూడింట్లో ఒకటి బ్లాక్ బస్టర్ టాక్ ని, మరో కటి హిట్ టాక్ ని, ఇంకొకటి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. దేవర దరువుమొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా సినిమా హిట్ అవటం అనేది ఈ వారమే మొదలు..
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి కాంబినేషన్ లోవెంకీ అట్లూరి తీసిన లక్కీ భాస్కర్ విషయానికొస్తే, బ్యాంక్ ఉద్యోగా స్కామ్ లు చేస్తూ కోట్లు గడించి, తర్వాత వచ్చే సమస్యల్లోంచి ఎలా భయట పడ్డాడనే పాయింట్ తో వచ్చింది ఈ సినిమా కథ.
ఈ సినిమా కథ కత్తిలా ఉందంటున్నారు. కథనం విషయంలో వెంకీ అట్లూరికి పొగడ్తల వర్షం కురుస్తోంది. దుల్కర్ సల్మాన్ అంతా తానై సినిమాను తన భుజాల మీదే మోశాడు. మ్యాూజిక్ పెద్దగా మ్యాజిక్ చేయకున్నా మహానటి, సీతారామం లాంటి పీరియాడిక్ కిక్ తర్వాత దుల్కర్ కి మళ్లీ లక్ కలిసొచ్చిందంటున్నారు. టాక్ కూడా కిక్ ఇస్తోంది.. ఆల్ మోస్ట్ మొదటి ఆటకే హిట్ టాక్ వచ్చేసింది
ఇక ఈ వారమే వచ్చిన క మూవీ అయితే ఏకంగా బ్లాక్ బస్టర్ టాకే సొంతం చేసుకుంది. మీడియం రేంజ్ కంటే తక్కేవ స్టామినా ఉన్న కిరణ్ అబ్బవరం చేసిన ప్రయోగమే క. టైటిలే వింత అనుకుంటే కథ చెప్పిన విధానం, ఊహికందని క్లైమాక్స్ కి జనం ఫిదా అయ్యారు. కథ, కథనం, పెర్ఫామెన్స్, మ్యూజిక్ ఓవరాల్ గా క్లైమాక్స్ మతిపోగొట్టింది.
దేవర లాంటి సునామీ తర్వాత మరో తెలుగు సినిమా ఈరేంజ్ లో దేవర దరువుని తట్టుకోవటమే వింతంటే, ఈ రేంజ్ లో హిట్ టాక్ రావటం మరో వింత.. మొత్తంగా లక్కీ భాస్కర్ కి హిట్ టాక్ వస్తే, క సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఇక తమిల డబ్బింగ్ మూవీ అమరన్ కి మరో మేజర్ గా పర్లేదనే టాక్ సొంతమైంది. మొత్తంగా దేవర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సౌత్ లో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న రెండు సినిమాలు తెలుగువే అవటం ఇక్కడ హాట్ టాపిక్.