MAD: మైండ్‌బ్లోయింగ్ హిట్.. ఈ సీజన్ సక్సెస్‌ మ్యాడ్‌ మూవీ..

ఈ నెల 6న సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. దీనితోపాటు క్రేజ్‌ వున్న మరో ఐదు సినిమాలు విడుదలయ్యాయి. సిద్దార్థ్‌ నటించిన చిన్నా.. కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్‌ రంజన్‌.. సుధీర్‌ బాబు నటించిన మామా మశ్చీంద్ర పోటీపడినా.. మాడ్‌ ఒక్కటే సక్సెస్‌ అయింది.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 05:22 PM IST

MAD: ఏదైనా క్రేజీ మూవీ రిలీజైతే.. టాపిక్‌ అంతా కలెక్షన్స్‌ గురించే. ఫస్ట్‌డే.. వీకెండ్‌.. వన్‌వీక్‌లో ఎంత కలెక్ట్ చేసిందో మాట్లాడుకుంటారు. అయితే ఓ సినిమాకు క్రేజే లేదు. నటీనటులు ఎవరో కూడా తెలియదు. అలాంటి మూవీ పోటీలో నిలబడి సక్సెస్‌ కావడమే కాదు.. సూపర్‌హిట్‌ అయింది. పెద్ద హిట్‌ అయిన ఆ చిన్న సినిమా మ్యాడ్‌. మ్యాడ్‌లో యాక్ట్ చేసిన రామ్‌ నితిన్‌, సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌.. ఎవరో కూడా జనాలకు తెలీదు. దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌కు ఇదే ఫస్ట్ మూవీ.

ఈ నెల 6న సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. దీనితోపాటు క్రేజ్‌ వున్న మరో ఐదు సినిమాలు విడుదలయ్యాయి. సిద్దార్థ్‌ నటించిన చిన్నా.. కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్‌ రంజన్‌.. సుధీర్‌ బాబు నటించిన మామా మశ్చీంద్ర పోటీపడినా.. మాడ్‌ ఒక్కటే సక్సెస్‌ అయింది. ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ కావడమే కాదు.. సూపర్‌హిట్‌ దిశగా దూసుకుపోతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు.. రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఇలా సినిమా రూ.10 కోట్ల గ్రాస్‌కు చేరింది. మ్యాడ్‌ సినిమాకు వచ్చిన టాక్‌తో పోలిస్తే.. ఈ వసూళ్లు తక్కువే. హాలిడేస్‌ లేకపోవడం ఒక రీజన్‌ అయితే.. మొదట్నుంచీ పెద్దగా ప్రమోషన్‌ చేయకపోవడం మరో రీజన్. ఎన్టీఆర్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన తర్వాత మ్యాడ్ సినిమా ఒకటి వస్తోందని జనాలకు తెలిసింది.

హాలిడేస్‌లో రిలీజ్‌ కాకున్నా.. రెండో వారం మరో సినిమా లేకపోవడం కలిసి రానుంది. 19న లియో, భగవంత్‌ కేసరి వచ్చే వరకు బాక్సాఫీస్‌ దగ్గర మ్యాడ్ హవానే నడుస్తుందని.. ఓవరాల్‌గా రూ.20 కోట్ల గ్రాస్‌ మార్క్‌ దాటుతుందని ట్రేడ్‌ వర్గాలు ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాయి.