MAD MOVIE: ఈ వారం మ్యాడ్, రూల్స్ రంజన్, మామా మశ్చింద్ర, మంథ్ ఆఫ్ మధు అంటూ నాలుగు తెలుగు సినిమాలొచ్చాయి. రెండు డబ్బింగ్ మూవీలకు పోటీ ఇచ్చాయి. ఐతే ఇందులో మ్యాటర్ లేకుండా కూడా మ్యాటర్ ఉన్న మూవీ అనిపించుకుంది మ్యాడ్ సినిమా ఒక్కటే. ఎందుకంటే ఇందులో పెద్దగా కథ లేదు. కథనం గురించి మాట్లాడాల్సిన పనిలేదు.
కాని కామెడీ ఉంది. కామెడీతో అల్లుకున్న సీన్లతో దర్శకుడు అండ్ టీం నెట్టుకొచ్చింది. జాతిరత్నాలంత సీన్ లేకున్నా కథా ప్రధాన్యం లేకుండా సీన్లతో, కామెడీ డైలాగ్స్ తో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేయొచ్చని మ్యాడ్ మూవీ మరో సారి ప్రూవ్ చేస్తోంది. కాలేజీ రోజులు, ముగ్గురు ఫ్రెండ్స్ తాలూకు ప్రేమ ప్రయాణం, ఇంతకు మించిన మరో పాయింట్ లేకున్నా మ్యాడ్ బాక్సాఫీస్ వద్ద దౌడ్ తీస్తోంది. రూల్స్ రంజన్ కి విజన్ మిస్ అయ్యింది. మామా మశ్చింద్రలో కన్ ప్యూజనే రాజ్యమేలుతోంది. మంథ్ ఆఫ్ మధు తలనొప్పి తెచ్చే ఎమోషన్ అనిపించుకుంది. నిజంగా ప్రేమలో పడ్డాక మారే రంజన్ లైఫ్ ఎలా మారిందో రూల్స్ రంజన్ లో చూపిస్తే, డివోర్స్ తీసుకోవాలనుకున్న జంట, వాళ్ల బోరింగ్ జర్నీ తో మంథ్ ఆఫ్ మధు వచ్చింది.
ఈ రెండింట్లో ఏమున్నాయో, లేవో చెప్పేకంటే, వినోదం లేదని పక్కన పెట్టడం బెటర్ అనుకోవాల్సి వస్తోంది. అలాని మామా మశ్చింద్ర అదుర్సా అంటే.. కాదు బెదుర్సే. జైలవకుశ, అమిగోస్ లానే ముగ్గురి పాత్రలేసి సుధీర్ బాబు పెద్ద సాహసమే చేశాడు. కాని కథలో క్లారిటీ లేక, కథనం కన్ ఫ్యూజ్ చేయటంతో, ఆడియన్స్ ఫ్యూజులు పోతున్నాయి. సో ఈ వీక్ నాలుగు తెలుగు సినిమాలొస్తే, అందులో ఒకటే బాగుందనుకోవాల్సి వస్తోంది. టాక్ కూడా అలానే ఉంది. అదేమ్యాడ్.