Maha Venkatesh: కేరాఫ్ కంచరపాలెం వంటి మంచి చిత్రంతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న వెంకటేష్ మహా ఆ తర్వాత మరో సినిమా చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం నటుడిగా పలు సినిమాల్లో నటిస్తున్న వెంకటేష్ ఆమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెజిఎఫ్ సినిమాను వివర్శించాడు. దీంతో ఆ సినిమా అభిమానులు, నెటిజన్లు వెంకటేష్‌పై ఫైర్ అయ్యారు. అతన్ని టార్గెట్ చేసిన నెటిజన్లకు సారీ చెప్పాడు. అయినప్పటికీ తన అభిప్రాయం మాత్రం మార్చుకోను అని తేల్చాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అతన్ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు.
SALAAR: ఎవడ్రా రీమేక్ అనేది.. ట్రైలర్ చూసారా ఇంతకీ..
తనని ట్రోల్ చేస్తే వారిపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటానని కామెంట్ చెయ్యడంతో నెటిజన్లు మరింత రెచ్చిపోయి అతన్ని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ తన పోస్ట్‌తో మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు వెంకటేష్. ప్రభాస్ కొత్త సినిమా ‘సలార్’ కోసం ప్రపంచమే ఎదురుచూస్తున్న తరుణంలో వెంకటేష్ మహా పెట్టిన ఓ పోస్ట్ అతన్ని ట్రోల్ చేసేలా ఉంది. ‘నా ఫేవరేట్ షారుఖ్ ఖాన్‌ని.. రాజ్ కుమార్ హిరాణిగారి సినిమాలో చూడటానికి నేను రెడీ. ఫస్ట్ డేనే టికెట్ బుక్ చేసుకున్నాను. సెన్సార్ బోర్డు వాళ్ళు సినిమా చూసి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారని విన్నాను. అదే కనక నిజమైతే ఈ సినిమా ఎమోషన్స్‌తో ఫిలిం లవర్స్‌ని మెప్పిస్తుంది’ అని ట్వీట్ చేశాడు. మొన్న ‘సలార్’ రిలీజ్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ పోస్ట్ పెట్టడంతో కావాలనే వెంకటేష్ అలా చేశాడని అందరూ భావిస్తున్నారు. తెలుగు డైరెక్టర్ అయి ఉండి బాలీవుడ్ హీరో నటించిన ‘డంకీ’ సినిమా కోసం పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు వెంకటేష్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.
గతంలో కెజిఎఫ్‌ని విమర్శించినట్టే ఇప్పుడు సలార్‌ని కూడా విమర్శిస్తున్నాడని ప్రభాస్ అభిమానులు, ప్రశాంత్ నీల్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అంతటితో ఆగకుండా వెంకటేష్ ఎకౌంట్‌ని రిపోర్ట్ కొట్టడం, అతన్ని ట్రోల్ చేయడంతో వెంటనే తన ఎకౌంట్‌ని డీ యాక్టివేట్ చేసేశాడు. ఇటీవల రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా నెటిజన్లు చేసిన కామెంట్స్‌కి రియాక్ట్ అయి వారి ధాటికి తట్టుకోలేక ఎకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశాడు. ఇప్పుడు వెంకటేష్ కూడా అదే చేశాడు. అనవసరమైన విషయాల గురించి స్పందించడం ఎందుకు, విమర్శలు ఎదుర్కోవడం ఎందుకు.. ఇప్పుడు ఎకౌంట్‌ను డీ యాక్టివేట్ చేసుకోవడం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.