Tollywood: టైటిల్స్‌ ఫైనల్‌ చేసిన పవన్‌, మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. ఈ ఇద్దరు సేమ్‌ జెనరేషన్‌ హీరోలకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు. సినిమాల్లో వీళ్ల రికార్డ్స్‌ ఎలా పోటాపోటీగా ఉంటాయో.. వీళ్ల ఫ్యాన్స్‌ కూడా ఇంటర్నెట్‌లో రికార్డ్స్‌ క్రియేట్‌ చేసేందుకు పోటీ పడుతుంటారు. అలాంటి ఫ్యాన్స్‌కు ఇద్దరు హీరోలు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాము చేస్తున్న ప్రాజెక్ట్స్‌ టైటిల్స్‌ను ఫైనల్ చేశారు.

  • Written By:
  • Publish Date - March 26, 2023 / 02:30 PM IST

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అమ్మకథ అని టైటిల్‌ పెట్టాలని ముందు అనుకున్నారు. స్టోరీకి సెట్‌ అవలేదు అనుకున్నారో లేక ఫ్యాన్స్‌ నుంచి వచ్చిన వ్యతిరేకతో తెలయదు కానీ టైటిల్‌ విషయంలో వెనక్కి తగ్గారు. ఫైనల్‌గా “అమరావతికి అటూ ఇటూ” అనే టైటిల్‌ను ఖరారు చేశారట.

ఇటు పవర్‌ స్టార్‌ కూడా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేస్తున్నాడు. తమిళ్‌ హిట్‌ మూవీ వినోదయాసితం రీమేక్‌గా వస్తున్న మూవీకి కూడా టైటిల్‌ ఫైనల్‌ చేశారు. ఈ సినిమాకు “దేవర” అనే టైటిల్‌ను ఫైనల్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ దేవుడిగా కనిపించనున్నాడు. దాదాపుగా గోపాల గోపాల లాంటి కాన్సెప్ట్‌. సాయి ధరమ్‌ తేజ్‌ పవన్‌ కళ్యాణ్‌ భక్తుడిగా కనిపించనున్నాడు. మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమాకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. వినోదయా సితం రీమేక్‌లో పవన్‌ కళ్యాణ్‌ పార్ట్‌ కంప్లీట్‌ అయ్యింది. మిగిలిన షూటింగ్‌ కూడా కంప్లీట్‌ చేసి.. ఏప్రిల్‌ 5న సినిమాను రిలీజ్‌ చేస్తామని మూవీ యూనిట్‌ ఎనౌన్స్‌ చేశారు. ఈ రెండు అప్‌డేట్స్‌తో పవర్‌స్టార్‌, సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ కుషీ అవుతున్నారు.