MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక్కటంటే ఒక్క పాన్ ఇండియా మూవీ తీయలేదు. చేయలేదు. కనీసం హిందీ మూవీల్లో మెరవలేదు. కాని మహేశ్ బాబు బాలీవుడ్ వాళ్లకే కాదు, నార్త్ ఇండియాలో తెలియని వాళ్లు లేరు. అలాంటి హీరోకి పాన్ ఇండియా లెవల్లో ఒక్క హిట్ పడితే ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, బన్నీని మించే ఛాన్స్ ఉంది. అదే రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమాతో సాధ్యమవుతోంది. సరే.. ఫ్యూచర్ ఎలా ఉంటుందో పక్కన పెడితే, ప్రజెంట్ పాన్ ఇండియా మార్కెట్‌లో క్రేజ్, ఇమేజ్ పరంగా చూస్తే ఆల్ ఇండియా నెంబర్ వన్ ప్రభాసే.
RAM CHARAN: మెగా పవర్ స్టార్ బర్త్ డేకి.. సెగ రేగాల్సిందేనా..?
బాహుబలి తర్వాత తనకి పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందంటే, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ పంచ్‌ల తర్వాత కూడా సలార్ వందలకోట్లు రాబట్టిందంటే, సింగిల్ హిట్, సింగిల్ ఫ్లాప్‌తో మారేది కాదు తన ఇమేజ్ అని తేలింది. అందుకే పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోగా మారాడు ప్రభాస్. ఆతర్వాత స్థానం పుష్పతో హిట్ మెట్టెక్కిన బన్నీకే దక్కాలి. కాని త్రిబుల్ ఆర్‌తో రాముడి గెటప్‌లో చరణ్ కనిపించి, నార్త్ ఇండియన్స్ మనసుల్లో దూరిపోయాడు. అందుకే చరణ్‌కి నార్త్ ఇండియాలో భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత స్థానం పుష్ప ఫేం బన్నీదైతే, త్రిబుల్ ఆర్‌లో చరణ్‌కి ఈక్వల్‌గా ఫోకస్ అయిన తారక్ మాత్రం నార్త్ ఇండియా మార్కెట్‌లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. వార్ 2 మూవీ ఆఫర్ వచ్చినా పీఆర్ టీం వల్ల ఎన్టీఆర్‌ని చరణ్ దాటేశాడు.
ఇక అర్జున్ రెడ్డి హిందీలో ఆడకున్నా, అప్పట్లోనే అన్ని భాషల్లో జనాలు చూసేయటం వల్ల రౌడీ స్టార్ అంటే నార్త్‌లో కూడా ఫేమస్. లైగర్ ప్లాపైపోయింది కాని, హిట్టైతే ప్రభాస్ తర్వాతి స్థానంలో సెటిలయ్యే వాడు. విచిత్రం ఏంటంటే హిందీ సినిమాలేవీ చేయని రామ్ కూడా తన గత సినిమాల హిందీ డబ్ వర్షన్ వల్ల నార్త్ ఇండియాన్స్‌కి దగ్గరయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ యూ ట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టడంతో నార్త్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకెళుతున్న తెలుగు హీరోల లిస్ట్‌లో రామ్ వచ్చి చేరాడు. ఆ తర్వాతి స్థానం నానికి దక్కేలా ఉంది.