MAHESH BABU: 2000 కోట్ల బడ్జెట్.. రాజమౌళి-మహేశ్ సినిమాకు అంత బడ్జెటా..?

మన దేశ సినిమా మార్కెట్ ఎంతుందో అంత మొత్తాన్ని మహేశ్ బాబు ఒక్క మూవీకే బడ్జెట్‌గా ప్లాన్ చేశాడు రాజమౌళి. అంటే తన మూవీ హిట్టైనా బాక్సాఫీస్‌ని షేక్ చేసినా పెట్టుబడే వస్తుంది కాని 2 వేల కోట్లకు మించి రాదు.

  • Written By:
  • Publish Date - January 24, 2024 / 06:40 PM IST

MAHESH BABU: దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు చేయబోయే సినిమా రూ.2000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కబోతోంది. అసలు ఇండియా టాప్ కలెక్షన్స్‌తో నెంబర్ వన్‌లో ఉన్న దంగల్ కలెక్షన్లే రెండు వేల కోట్లు. ఇండియా మొత్తం సునామీ క్రియేట్ చేసిన బాహుబలి 2 వసూళ్లే 1800 కోట్లు. సో.. ఎంతో హిట్ అయితే తప్ప రూ.1800 కోట్లు, రెండు వేల కోట్లు రావు.

DEVARA-KALKI 2898 AD: ఏ సినిమా ఎప్పుడు రిలీజ్.. అంతా కన్ఫ్యూజన్..

అలాంటిది మన దేశ సినిమా మార్కెట్ ఎంతుందో అంత మొత్తాన్ని మహేశ్ బాబు ఒక్క మూవీకే బడ్జెట్‌గా ప్లాన్ చేశాడు రాజమౌళి. అంటే తన మూవీ హిట్టైనా బాక్సాఫీస్‌ని షేక్ చేసినా పెట్టుబడే వస్తుంది కాని 2 వేల కోట్లకు మించి రాదు. మరే నమ్మకంతో 2 వేల కోట్ల బడ్జెట్ ప్లాన్ చేశాడు..? అక్కడే ట్విస్ట్ ఉంది. ఈగ మూవీ వచ్చినప్పుడు భారీగా ఖర్చైంది. కానీ, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ మార్కెట్లో ఈ సినిమాను రిలీజ్ చేసి లాభాలు రాబట్టాడు రాజమౌళి. ఇక తెలుగు మార్కెట్ రేంజే 2 వందల కోట్లున్న టైంలో 5 వందల కోట్లతో బాహుబలి తీశాడు.

కాని పాన్ ఇండియా మార్కెట్ షేకై 1800 కోట్లొచ్చాయి. సో.. ఇలా బడ్జెట్ పెంచిన ప్రతీసారి మార్కెట్ కూడా పెంచి సక్సెస్ అయ్యాడు రాజమౌళి. అలానే 2 వేల కోట్లతో మహేశ్ బాబు మూవీ తీసి, దాన్ని ఐదు వేల కోట్లుగా మారుస్తాడా..? అదే జరగాలంటే త్రిబుల్ ఆర్‌ని మించేలా వరల్డ్ మార్కెట్‌ని మహేశ్ బాబు సినిమా షేక్ చేయాలి. ఆ నమ్మకంతోనే రాజమౌళి.. ఇలా రెండు వేల కోట్ల రిస్క్ చేస్తున్నట్టున్నాడు.