MAHESH BABU: రాజమౌళి మూవీ కోసం జర్మనీ కి మహేశ్..

రాజమౌళి మూవీ మొదలౌతుందంటే, ప్రెస్ మీట్ పెట్టడం, అందులో జోనర్ ఎనౌన్స్‌మెంట్ లాంటివి ఉంటాయి. అవేవి లేకుండా సైలెంట్‌గా మహేశ్‌ని జర్మనీకి పంపించేస్తూ జక్కన్న రూట్ మార్చాడు. అక్కడేమీ కండలు పెంచేందుకు మహేశ్‌కి ట్రైనింగ్ ఇప్పించట్లేదట.

  • Written By:
  • Publish Date - January 20, 2024 / 05:49 PM IST

MAHESH BABU: గుంటూరు కారం సందడి అటుంచితే, ఇక మహేశ్‌‌తో రాజమౌళి మూవీ సందడి మొదలైంది. కథ పూర్తైందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ తేల్చటం ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే అంశం. ఇప్పుడు మహేశ్ జర్మనీ ట్రిప్ ఇంకా కిక్ ఇచ్చేలా ఉంది. రాజమౌళి మూవీ మొదలౌతుందంటే, ప్రెస్ మీట్ పెట్టడం, అందులో జోనర్ ఎనౌన్స్‌మెంట్ లాంటివి ఉంటాయి. అవేవి లేకుండా సైలెంట్‌గా మహేశ్‌ని జర్మనీకి పంపించేస్తూ జక్కన్న రూట్ మార్చాడు.

Oscar Race 2024: తెలుగు సినిమా కీర్తి.. 2024 ఆస్కార్‌కి దసరా..

అక్కడేమీ కండలు పెంచేందుకు మహేశ్‌కి ట్రైనింగ్ ఇప్పించట్లేదట. కౌబాయ్ లైఫ్ ఎలా ఉంటుంది.. దానికి తోడు కొన్ని హిస్టారికల్ ఈవెంట్లు.. ఇవన్నీ అక్కడ 8 రోజులు నేర్పించేందుకు రాజమౌళి వర్క్ షాప్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఇది ఇండియానా జోన్స్ లాంటి సినిమానే అని ప్రచారం జరుగుతోంది. అందులో కొంత నిజముంది. కాకపోతే హాలీవుడ్ మూవీ కౌబాయ్స్ అండ్ ఏలియన్స్‌లో హీరో పాత్రని ప్రేరణగా తీసుకుని ఇందులో మహేశ్‌ని కౌబాయ్‌గా చూపించబోతున్నారట.

అలాగని ఇది కౌబాయ్ జోనర్‌లో వచ్చే మూవీలా టక్కరిదొంగలా ఉండదట. ఒక రకంగా చెప్పాలంటే ఇండియానా జోన్స్‌లో హీరో ప్రొఫేసర్.. కాని ఆ పాత్రని కౌబాయ్‌తో రిప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ అన్న ప్రచారం జరుగుతోంది.