SSMB 29: రాజమౌళితో మహేశ్ చేసే సినిమాతాలూకు రెమ్యునరేషన్ అందరినీ పరేషాన్ చేసేలా ఉంది. ఈ సినిమాకు మహేశ్, రాజమౌళి గతంలో చెప్పినట్టే రెమ్యునరేషన్ తీసుకోవట్లేదట. సినిమా ప్రాఫిట్లో రాజమౌళికి 35 శాతం, మహేశ్ బాబుకి 35 శాతం, ఇక పాన్ వరల్డ్ ప్రమోషన్‌కి, ఆస్కార్ ప్రమోషన్‌కి 10 శాతం, ఆ తర్వాత మిగిలిన 20శాతం నిర్మాత కేఎల్ నారాయణకి. ఇదే నిజం. ఈ పంపకాలు ఎప్పుడో జరిగాయి. కాని కొత్తగా లెక్కల్ని ఈ వారమే మాట్లాడుకుంటున్నారట.
Trisha : డేటింగ్ ఒక్కరితో చేయలేదు…
ఆ లెక్కల ప్రకారం, కొన్ని ఏరియా రైట్స్‌ని దర్శకుడు, హీరోకి కూడా నిర్మాత రాసివ్వటం, ప్రాఫిట్‌లో షేర్ ఇవ్వడం వంటి డాక్యుమెంటేషన్ ఈ వారమే పూర్తి కానుంది. ఏప్రిల్, మేలో రిహార్సల్స్, ఆగస్ట్‌లో లాంచింగ్, ఇయర్ ఎండ్ లేదంటే సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసిన ఈమూవీ లెక్కలు పూర్తవ్వబోతున్నాయి. ఈమూవీ పెట్టుబడిపోను 1000 కోట్ల లాభం వస్తే మహేశ్‌కి 350 కోట్లు, రాజమౌళికి 350 కోట్లు, నిర్మాతకి 200 కోట్లు, ఆస్కార్ ప్రమోషన్‌కి రూ.100 కోట్లు.. ఇలా లెక్కేశారు. నిజంగానే మహేశ్ ఈ మూవీ వల్ల రెండు నుంచి మూడేళ్లు లాస్ అవుతున్నాడు.
సినిమాకు వందకోట్లు తీసుకునే తను మూడేళ్ల కాల్ షీట్స్ వదులుకుంటున్నాడు కాబట్టే 35 శాతం వాటా తనకి తక్కబోతోంది. అంటే వెయ్యికోట్ల పెట్టుబడి పోను మరో వెయ్యికోట్ల లాభం ఈమూవీకే వస్తే, రూ.350 కోట్లు అందుకోనున్న స్టార్‌గా మహేశ్ రికార్డ్ క్రియేట్ చేస్తాడు. ఒకవేళ వెయ్యికోట్లకంటే ఎక్కువే వస్తే, 400 కోట్ల పారితోషికం కూడా అందుకున్నట్టే. ఇలాంటి వండర్స్ త్వరలో జరగబోతున్నాయి.