Mahesh – Koratala: కొరటాల శివ వెంట పడుతున్న మహేష్ ఫ్యాన్స్‌

వాళ్లు డిమాండ్‌ చేసేది సినిమా రీరిలీజ్‌ కాదు. కొత్త ప్రాజెక్ట్‌ నుంచి అప్డేట్‌ కూడా కాదు. ఎప్పుడో కంప్లీట్‌ అయిపోయిన సినిమా నుంచి ఓ ఫైట్‌ సీన్‌. కానీ ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే ఆ ఫైట్‌ నిజానికి సినిమాలో లేదు.

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 05:25 PM IST

సాధారణంగా డైహార్డ్‌ ఫ్యాన్స్‌ అంటేనే క్రేజీగా ఉంటారు. వాళ్ల కోరికలు కూడా క్రేజీగానే ఉంటాయి. కానీ ఫ్యాన్స్‌ నందు మహేష్‌ ఫ్యాన్స్‌ వేరయా అంటున్నారు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌. ఎందుకంటే వాళ్లు డిమాండ్‌ చేసేది సినిమా రీరిలీజ్‌ కాదు. కొత్త ప్రాజెక్ట్‌ నుంచి అప్డేట్‌ కూడా కాదు. ఎప్పుడో కంప్లీట్‌ అయిపోయిన సినిమా నుంచి ఓ ఫైట్‌ సీన్‌. కానీ ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే ఆ ఫైట్‌ నిజానికి సినిమాలో లేదు.

అవును.. మహేష్‌ బాబు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్‌ అనే నేను సినిమాలో మహేష్‌తో ఓ ఫైట్‌ షూట్‌ చేశాడు కొరటాల శివ. చాలా స్టైలిష్‌ లుక్‌లో హోలీ రోజున ఈ ఫైట్‌ జరుగుతుంది. కానీ సినిమా పూర్తయ్యాక లెంత్‌ ఎక్కువయ్యింది అనుకున్నారో లేక ఫైట్‌ సెట్‌ కాలేదు అనుకున్నారో తెలియదు కానీ సినిమా నుంచి ఫైట్‌ సీన్‌ను డెలిట్‌ చేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఎలాగో ఫ్యాన్స్‌కు లీకయ్యింది. సరే సినిమాలో లేకపోయినా కనీసం యూట్యూబ్‌లో అయినా ఫైట్‌ సీన్‌ పెడతారేమో అనుకున్నారంతా. కానీ నాలుగేళ్లు గడుస్తున్నా ఆ సీన్‌ మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. దీంతో ఈ హోలీకి ఆ ఫైట్‌ సీన్‌ను రిలీజ్‌ చేయ్యాలని ఫ్యాన్స్‌ పట్టుబడుతున్నారు.

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌.. ఇలా ఎక్కడ పడితే అక్కడ కొరటాలను ట్యాగ్‌ చేస్తూ ఫైట్‌ రిలీజ్‌ చేయమని డిమాండ్‌ చేస్తున్నారు. సాధారణంగా హోలీ అంటే అంతా రంగులతో సెలబ్రేట్‌ చేసుకుంటారు. కానీ మహేష్‌ ఫ్యాన్స్‌ మాత్రం వెరైటీగా ఆ ఫైట్‌తో సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకున్నారు కావొచ్చు. అందుకే ఈ రేంజ్‌లో వెంటపడుతున్నారు. మహేష్‌ బాబు సీఎంగా స్టైలిస్‌ లుక్‌లో కనిపించిన భరత్‌ అనే నేను సినిమాలో మంచి మెసేజ్‌ కూడా ఉంటుంది. కొత్త తరం పొలికల్‌ థాట్‌తో ముందుకు వచ్చిన ఈ సినిమా.. 2 వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. సినిమా ఆ రేంజ్‌లో హిట్‌ అయింది కాబట్టే.. అందులో ఫైట్‌ను కూడా మిస్‌ కావొద్దు అనుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు.