రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరి జోలికి పోడు.. వివాదానికి వెల్ కమ్ చెప్పాడు. అందుకే అందరి డార్లింగయ్యాడు. కాని ఇప్పుడు తన మీద ఒక హీరో చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి.. అదక్కడితో ఆగిపోలేదు.. మరో స్టార్ మహేశ్ బాబు మీద కూడా నోరు జారారు.. మరి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అదే జరిగింది. ఏదో సరదాకోసం చేస్తే, నవ్వులు పోయి గొడవలు మొదలయ్యాయి. ఏకంగా సోషల్ మీడియాలో చిన్న పాటి యుద్ధం కాస్త పెద్ద తుఫాన్ లా మారుతోంది. అసలే రెబల్ స్టార్ ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంటే కరుడు గట్టని అరవ జనం కూడా వణికిపోతారు.. అలాంటి వాళ్ల అభిమాన హీరోలని గెలికితే ఊరుకుంటారా…? ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగిపోయింది. ఇంతకి ఆ వివాదమేంటోచూసేయండి.
రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలు, వాళ్ళ పేర్లను హీరో రానా రైట్ ప్లేస్ లోరాంగ్ గా వాడాడనే కామెంట్స్ పెరిగాయి. ఐఫా అవార్డు ఫంక్షన్ లో తేజా, రానా ఇద్దరూ చేసిన ఫన్నీ కన్ వర్జే షన్ కాంట్ర వర్సీగా మారింది. సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం తో పోలిస్తే, హనుమాన్ దే పై చేయిందనే మీనింగ్ కాస్త ఆడ్ గా అనిపించేలా జోక్ చేశాడు రానా.. ఇక ఆదిపురుష్ లో హనుమంతుడి కోసం సీట్ మిగల్చటం, ఆటాపిక్ ని హనుమాన్ మూవీతో పోల్చటంతో ఈ కామెంట్స్ మిస్ ఫైర్ అయ్యాయనే మాటలే వినిపిస్తున్నాయి
బేసిగ్గా రెబల్ స్టార్ ప్రభాస్ కి రాణా మంచి స్నేహితుడు… కలిసి బాహుబలి కూడా చేశారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే రానాకి స్నేహంతో పాటు గౌరవం కూడా ఎక్కువే. కాని హిందీ అవార్డు ఫంక్షన్స్ లో ఒక హీరో మీద మరో స్టార్ సెటైర్లు వేసినట్టు, యాజ్ ఇట్ ఈజ్ అదే ఫార్ములాని తెలుగు హీరోల మీద వాడారు.
అదే బెడిసి కొడుతోంది. బాలీవుడ్ లో ఒకరి మీద మరో కరు సెటైర్లు వేస్తే ఓకే కాని, సౌత్ లో ఫ్యాన్స్ కి ఎమోషన్స్ ఎక్కువ. తమ అభిమాన హీరో మీద కామెంట్ వేస్టే, ఎన్ కౌంటరే.. ఆమధ్య మహేశ్ మీద తమిళ స్టాండప్ కమేడియన్ కామెంట్ చేస్తే, గూబ పగిలిపోయేలా సోషల్ మీడియాలో ఎటాక్చేసింది తన ఫ్యాన్స్ బ్యాచ్ .. దెబ్బకు సారి చెప్పీ తర్వాత నోటికి కుట్లేసుకున్నట్టు మూసుక్కూర్చున్నాడు
ఇప్పుడు రానా పరిస్థితి అలానే ఉంటుందా అంటే, చాలావరకు తనవి తప్పుడు ఉద్దేశ్యాలు కావు.. మరీ ఘోరమైన కామెంట్ చేయకున్నా, గుంటూరు కారాన్ని తక్కువ చేసి మాట్లాడటం… ఆదిపురుష్ మీద స్టేట్ మెంట్ విసరటం మాత్రం ఇటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి , అటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మండేలా చేసింది. కాబట్టే కౌంటర్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో యుద్దం తుఫానులా మారిపోతోంది
అవార్డు వేడుకల్లో జరిగిన ఈ తంతు, సోషల్ మీడియాలో మాటల యుద్దానికి దారి తీసింది. ఇక బాలయ్యకి ఫోన్ చేసిన సందర్భం కూడా ఫన్నీగానే ఉన్నా, ఆ ఐడియా కూడా బెడిసి కొట్టింది. మొత్తానికి అవార్డు వేడుకల్లో జోకులు వేయబోతే, షాకులు తగిలినట్టు, రాంగ్ స్టేట్ మెంట్ బూమరాంగ్ అయ్యింది. రానా సీన్ లోకి వచ్చి ఎక్స్ ప్లేయిన్ చేస్తేనో మరో విదంగానో ఈ సోషల్ మీడియా మంట తగ్గటం కష్టం.