Mahesh Babu: డైలమాలో పడ్డ #SSMB28.. టెన్షన్‌ పడుతున్న మహేష్‌ ఫ్యాన్స్‌..

మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్డున్న సినిమా SSMB28. ఈ సినిమా మీద ఫ్యాన్స్‌ పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కాదు. ఎందుకంటే త్రివిక్రమ్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌కు మంచి పేరుంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు నిజానికి థియేటర్స్‌లో పెద్దగా ఆడలేదు. కానీ ఆడియన్స్‌లో మాత్రం ఈ సినిమాలకు మంచి క్రేజ్‌ వచ్చింది.

  • Written By:
  • Publish Date - May 13, 2023 / 05:26 PM IST

ముఖ్యంగా డైలాగ్స్‌, కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ఈ రెండు సినిమాలు ఎందుకు ఫెయిల్‌ అయ్యాయో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. కానీ ఫెయిల్‌ అయ్యాయి అదే మ్యాజిక్కు. మంచి ఎంటర్టైనర్‌ కాంబోగా పేరున్న ఈ స్టార్‌ డైరెక్టర్‌, హీరో ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రెండు షెడ్యూల్స్‌ కూడా కంప్లీట్‌ అయ్యాయి. ఆ మధ్య రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌ ఐపోగానే మహేష్‌ ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి రాగానే దుబాయ్‌ వెళ్లాడు. ఆ వెకేషన్‌ కంప్లీట్‌ అవ్వగానే SSMB28 థర్డ్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం థర్డ్‌ షెడ్యూల్‌ స్టార్ట్‌ చేసేందుకు త్రివిక్రంతో పాటు మేకర్స్‌కు కొన్ని కండీషన్స్‌ పెట్టాడట మహేష్‌ బాబు.

స్క్రిప్ట్‌ విషయంలో తాను కాస్త కన్ఫ్యూజన్‌లో ఉన్నానని చెప్పాడట. వెంటనే తనకు ఫుల్‌బౌండ్‌ స్క్రిప్ట్‌ కావాలని అడిగాడట. కానీ ఆ స్క్రిప్ట్‌ ఇంకా రెడీ కాలేదు. దీంతో మహేష్‌కు ఏం చెప్పలేకపోతున్నాడట గురూజీ. అంతే కాదు.. షెడ్యూల్స్‌ ప్లాన్‌కూడా ముందుగానే తనకు చెప్పాలని కండీషన్‌ పెట్టాడట మహేష్‌ బాబు. ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ లేకుండా షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేయడం తనకు కష్టంగా ఉందని చెప్పాడట. షెడ్యూల్‌ విషయం పక్కన పెడితే స్క్రిప్ట్‌ విషయంలో మహేష్‌ పెట్టిన కండీషన్‌కు కాస్త ఇబ్బంది పడుతున్నారట మేకర్స్‌. ఎందుకంటే స్క్రిప్ట్‌ ఇంకా రెడీ కాలేదు.. కానీ మహేష్‌ మాత్రం ఫుల్‌ బౌండ్‌ స్క్రిప్ట్‌ అడుగుతున్నాడు. దీంతో ఈ సినిమా థర్డ్‌ షెడ్యూల్‌ ఇంకా లేట్‌ అయ్యే చాన్స్‌ ఉంది అంటున్నారు.

రీసెంట్‌గానే ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్‌ మీడియాలో గాసిప్స్‌ వచ్చాయి. దీంతో మేకర్స్‌ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మహేష్‌ బాబు వెకేషన్‌ నుంచి రాగానే షూటింగ్‌ రీస్టార్ట్‌ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మహేష్‌ పెట్టిన కండీషన్స్‌ విషయం బయటికి రావడంతో సినిమా ఫ్యూచర్‌ ఏంటా అని టెన్షన్‌ పడుతున్నారు మహేష్‌ ఫ్యాన్స్‌.