మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతోంది. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో కొనసాగుతున్న ఈ సినిమాకు రీసెంట్‌గానే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు అమ్మ కథ అనే టైటిల్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట గురూజీ. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఇంటర్నెట్కు ఎక్కింది. ఇంకేముంది నెటిజన్లు ఊరుకుంటారా. గురూజీని ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. ఇదేం పేరు గురూజీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. విపరీతమైన మీమ్స్ క్రియేట్ చేసి ఫుట్‌బాల్ ఆడేస్తున్నారు.
త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు టైటిల్స్ కూడా వినేందుకు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు మాత్రం ఎందుకు ఇలాంటి టైటిల్ ఆలోచిస్తున్నారంటూ త్రివిక్రమ్‌ను క్వశ్చన్ చేస్తున్నారు. అయితే టైటిల్స్ విషయంలో త్రివిక్రమ్ చాలా పర్టికులర్‌గా ఉంటారు. స్టోరీ లైన్‌ను జస్టిఫై చేసేలా ఉంటేనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తారు. అత్తారింటికి దారేది సినిమా సమయంలో ఆ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పేందుకు ఓ పెద్ద స్పీచ్ ఇచ్చారు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ టైటిల్ వెనక కూడా అలాంటిదే ఏదో స్టోరి ఉంటుందని ఇంటర్నెట్లో డిస్కషన్ నడుస్తోంది. ఏది ఏమైనా అమ్మ కథ అనే టైటిల్ తమకు నచ్చలేదంటున్నారు చాలా మంది ఫ్యాన్స్. ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ ఉన్న టైంలో ఇలాంటి టైటిల్స్‌తో డిసప్పాయింట్ చేయకండి అంటూ త్రివిక్రమ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు.
త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమా అండర్ రేటెడ్‌గా నిలిచాయి. థియేటర్స్‌కు ప్రేక్షకులను రప్పించలేకపోయినా.. ఈ రెండు సినిమాలకు జెన్యూన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా వస్తోంది అంటే ఫ్యాన్స్ అంచనాలు మామూలుగానే హైలో ఉంటాయి. ఇలాంటి టైంలో అమ్మ కథ అనే టైటిల్ వాళ్లను డిసప్పాయింట్ చేస్తోంది. ఈ టైటిల్ దాదాపు ఖరారు అయినా.. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న చర్చ కారణంగా టైటిల్‌ను మార్చేస్తారా లేక అదే టైటిల్‌ను ఫైనల్ చేస్తారా చూడాలి మరి.