Mahesh babu: జిమ్‌లో కష్టపడుతున్న మహేశ్.. రాజమౌళి సినిమా కోసమేనా..?

వర్కవుట్స్‌ చేయడం.. బాడీని మెయిన్‌టేన్‌ చేయడం మహేశ్‌కు అలవాటే అయినా ఇన్‌స్టాలో పెట్టిన ఫొటో చూస్తుంటే.. ఎవరి కోసం ఈ కండలు అనే డౌట్‌ వస్తోంది. ఈ కసరత్తుల వెనకాల వున్న రాజమౌళి వున్నాడా..?

  • Written By:
  • Publish Date - October 18, 2023 / 08:37 PM IST

Mahesh babu: మహేశ్‌ అందంగా వున్నాడు. హాలీవుడ్‌ హీరోలా వుంటాడు. ఇవన్నీ టాలీవుడ్‌ ప్రిన్స్‌ గురించి అందరూ చెప్పుకునేదే. ఇప్పుడు ఈ అందాలకు కండలు అద్దుతున్నాడు మహేశ్‌. వర్కవుట్స్‌ చేయడం.. బాడీని మెయిన్‌టేన్‌ చేయడం మహేశ్‌కు అలవాటే అయినా ఇన్‌స్టాలో పెట్టిన ఫొటో చూస్తుంటే.. ఎవరి కోసం ఈ కండలు అనే డౌట్‌ వస్తోంది. ఈ కసరత్తుల వెనకాల వున్న రాజమౌళి వున్నాడా..? మహేశ్‌ ప్రస్తుతం తివిక్రమ్‌ సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి ఈ వర్కవుట్స్‌ అన్నీ ఈ మూవీ కోసమే అనుకుంటే పొరపాటే.

ఈ కష్టమంతా కాస్త త్రివిక్రమ్‌ కోసం.. ఎక్కువ రాజమౌళి కోసమే. కసరత్తులన్నీ రాజమౌళి సినిమా కోసమే కదా అని మహేశ్‌ను అడిగితే.. లేదండి.. రెగ్యులర్‌గా చేసే వర్కవుట్సే అంటూ చెప్పుకొచ్చాడు. హీరోలు ఏదో ఒక సందర్భంలో సిక్స్‌ ప్యాక్‌ చూపించినవాళ్లే. మహేశ్‌బాబు సిక్స్‌ ప్యాక్‌ చేసినా.. షర్ట్‌ విప్పలేదు. సుకుమార్‌ సలహా మేరకు నేనొక్కడినే సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ చేశాడు. కానీ, కండలు పూర్తిగా చూపించలేదు. మహేశ్‌కు సిగ్గు ఎక్కువ. అందుకే చొక్కా విప్పడం ఇష్టం లేదన్న కామెంట్స్‌ వినిపిస్తూ వుంటాయి. నేనొక్కడినేలో కూడా బ్యాక్‌ నుంచి మాత్రమే చూపించాడు. మహేశ్‌ ఫస్ట్ టైం షర్ట్‌ తీసేసి ఆమధ్య ప్లెయిన్‌ ప్యాక్‌తో షాక్‌ ఇచ్చాడు. ఇంట్లో స్మిమ్మింగ్‌ఫూల్లో తీసిన ఫొటోను నమ్రత ఆమధ్య షేర్‌ చేసింది.

మహేశ్‌ ప్రస్తుతం ఏం చేసినా.. రాజమౌళి సినిమా ప్రిపరేషన్‌లో భాగమే. రాజమౌళి, మహేశ్‌ మూవీ గ్లోబల్ సినిమాగా రూపొందుతోంది. హాలీవుడ్‌కు పరిచయమయ్యే క్రమంలో.. ఇప్పటి నుంచే ఫిజిక్‌పై దృష్టి పెట్టాడు మహేశ్‌. లేటెస్ట్‌గా మరో స్టిల్‌ పోస్ట్ చేశాడు. రాజమౌళి, మహేశ్‌ మూవీ షూటింగ్‌ మార్చిలో మొదలవుతుందని టాక్‌. అందుకే.. స్పీడప్‌ చేసి కండలు పెంచుతున్నాడు మహేశ్‌. ఇప్పటి నుంచే రాజమౌళి హీరోలా మేకోవర్‌ అవుతూ.. జిమ్‌లో ఎక్కువ కనిపిస్తున్నాడు.