Guntur Kaaram Record: రమణగాడి రచ్చ.. గుంటూరు కారం ఆల్ టైం రికార్డ్

నెట్‌ఫ్లిక్స్‌లో 2024 సంవత్సరంలో అత్యధిక వీక్షకులు చూసిన దక్షిణ భారత సినిమాగా రికార్డు సృష్టించింది. 4.9 మిలియన్ల వ్యూస్‌తో గుంటూరు కారం మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో నాని నటించిన హాయ్ నాన్న 4.2 మిలియన్ల వ్యూస్, ప్రభాస్– ప్రశాంత్ నీల్‌ల మాస్ యాక్షన్ డ్రామా సలార్ 3.5 మిలియన్ల వ్యూస్‌లో నిలిచాయి.

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 04:34 PM IST

Guntur Kaaram Record: చూస్తుంటే ఓటీటీలో మహేష్ బాబు గుంటూరు కారం డామినేషన్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఫిబ్రవరిలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్‌లో అడుగుపెట్టినప్పుటి నుంచీ ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రికార్డుల వేట మొదలుపెట్టింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌లో 2024 సంవత్సరంలో అత్యధిక వీక్షకులు చూసిన దక్షిణ భారత సినిమాగా రికార్డు సృష్టించింది.

Mudragada Padmanabham: వైసీపీలోకి కాపు నేత ముద్రగడ.. పవన్‌పై పోటీ చేస్తారా..?

4.9 మిలియన్ల వ్యూస్‌తో గుంటూరు కారం మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో నాని నటించిన హాయ్ నాన్న 4.2 మిలియన్ల వ్యూస్, ప్రభాస్– ప్రశాంత్ నీల్‌ల మాస్ యాక్షన్ డ్రామా సలార్ 3.5 మిలియన్ల వ్యూస్‌లో నిలిచాయి. గత వారం నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన టాప్ 10 ఇండియా లిస్ట్‌లో గుంటూరు కారం హిందీ వెర్షన్ కూడా ఉంది. షారుఖ్ ఖాన్ ‘డంకీ’ నెం.1 స్థానంలో ట్రెండ్ అవగా, ‘యానిమల్’ కూడా ఆ చార్ట్‌లో వరుసగా ఆరో వారం నిలిచింది. ఫిబ్రవరి 26 – మార్చి 3, 2024 వరకూ నెట్ ఫ్లిక్స్‌లో టాప్ 10 సినిమాల్లో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఏంటంటే ‘గుంటూరు కారం’ హిందీ డబ్బింగ్ వెర్షన్ 6వ స్థానంలో ట్రెండింగ్లో ఉండడమే. కాగా గుంటూరు కారం అంతకు ముందు వారంలో 4వ స్థానంలో నిలిచింది. మొత్తంగా గుంటూరు కారం హిందీ డబ్బింగ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ 10లో వరుసగా నాలుగో వారం ట్రెండింగ్లో ఉంది.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో పని చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. మళ్ళీ తన అభిమానులను అలరించేలా పక్కా మాస్ సినిమా చేయడానికి సమయం పడుతుంది కాబట్టి అన్ని అంశాలూ గుంటురు కారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఆయన అనుకున్నట్లే రమణ అనే మాస్ క్యారెక్టర్ లో తనదైన శైలికి ఎంటర్టైన్ చేసి గుంటూరు కారం సినిమాకి థియేటర్లలో తన స్టార్ ఇమేజ్‌తో కలెక్షన్లు తెచ్చిపెట్టడమే కాక ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించారు.