SSMB 29: మహేశ్ బాబు సినిమాలో.. విలన్‌గా గ్రీక్ గాడ్..

ఇందులో హీరోయిన్‌గా ఇండోనేషియా మూలాలున్న అమెరికా నటి చెల్సియా నటించబోతోంది. ఇలా హీరోకి జోడీగా హీరోయిన్ కన్ఫామ్ అయ్యింది. కాని విలనే కన్ఫామ్ కాలేదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది.

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 06:36 PM IST

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో హృతిక్ రోషన్ నటించబోతున్నాడంటే బాలీవుడ్ షేక్ అవ్వాలి. పాన్ ఇండియా మార్కెట్ ఊగిపోవాలి. అలాంటి హల్చల్ ఎక్కడా కనిపించట్లేదు. కారణం.. ఇంకా ఏది అఫీషియల్‌గా కన్ఫామ్ కాలేదు. కాని తెరవెనక దర్శక ధీరుడు రాజమౌళి భారీ స్కెచ్చే వేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో రూ.15 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేస్తున్నారు. అందులోనే జూన్ నుంచి మహేశ్ బాబు షూటింగ్ మొదలౌతుంది.

MEGASTAR CHIRANJEEVI: మెగాస్టార్ పదో తరగతి సర్టిఫికెట్ చూశారా..!

అయితే ఇందులో హీరోయిన్‌గా ఇండోనేషియా మూలాలున్న అమెరికా నటి చెల్సియా నటించబోతోంది. ఇలా హీరోకి జోడీగా హీరోయిన్ కన్ఫామ్ అయ్యింది. కాని విలనే కన్ఫామ్ కాలేదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది. రాజమౌళి తీసే మహేశ్ బాబు మూవీలో విలన్.. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అని ఆల్‌మోస్ట్ కన్ఫామ్ అంటున్నారు. నిజానికి వార్ సీక్వెల్ వార్ 2 మూవీలో విలన్‌గా తెలుగు స్టార్ ఎన్టీఆర్ నటించబోతుంటే, అదే సినిమాకు చెందిన హీరో హృతిక్ రోషన్ ఇప్పుడు తెలుగు సినిమాలో విలన్‌గా కనిపించేలా ఉన్నాడు. రాజమౌళీ టీం కాని, హృతిక్ రోషన్ కాని ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. కాకపోతే హృతిక్ రోషన్ మాత్రం మహేశ్ బాబు సినిమాలో విలన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అలాగే.. 80 రోజుల కాల్‌షీట్స్ కూడా ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే పాన్ ఇండియా మార్కెట్‌లో భూమి బద్ధలౌతుంది. ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ సినిమాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. అసలే బాలీవుడ్‌లో హాలీవుడ్ లుక్ ఉన్న హీరో హృతిక్, టాలీవుడ్‌లో బాలీవుడ్, హాలీవుడ్ హీరో లుక్కన్న స్టార్ మహేశ్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వార్ అంటే బాక్సాఫీస్ బద్ధలే.