MAHESH BABU: ఏమున్నాడ్రా బాబు.. స్టన్నింగ్ లుక్‏లో మహేష్..

ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఎక్కడ చూసినా ఈ పిక్సే కనిపిస్తున్నాయి. అభిమానులు సైతం నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్‌ సినిమాలకు ఈయన గ్రీక్‌ గాడ్‌ అంటూ ఒకరు పోస్ట్‌ చేస్తే, హాలీవుడ్‌ కటౌట్‌ ఇది అంటూ మరొకరు కామెంట్లు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 02:50 PM IST

MAHESH BABU: గుంటూరు కారం చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల్ని అలరించిన మహేష్‌ బాబు ఇప్పుడు లుక్‌ మొత్తం మార్చేశారు. మరింత గ్లామరస్‌గా తయారై ఫోటో షూట్‌ చేశారు. సింపుల్‌ ప్లెయిన్‌ గ్రీన్‌ కలర్‌ టీషర్టులో, సూపర్‌ లుక్‌లో వావ్‌ అనిపించేట్టుగా ఉన్నారు. అలాగే మరో బ్లూ కలర్‌ ఫార్మల్‌ షర్టులో ఉన్న ఫొటో సైతం ఎంతో బాగుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఎక్కడ చూసినా ఈ పిక్సే కనిపిస్తున్నాయి.

Allu Arjun: లోడింగ్.. పుష్ప ది రూల్‌ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్.. అందరిలో ఆసక్తి

అభిమానులు సైతం నచ్చిన విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్‌ సినిమాలకు ఈయన గ్రీక్‌ గాడ్‌ అంటూ ఒకరు పోస్ట్‌ చేస్తే, హాలీవుడ్‌ కటౌట్‌ ఇది అంటూ మరొకరు కామెంట్లు చేస్తున్నారు. మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. జక్కన్నతో సినిమా అంటే దాదాపుగా మూడు నాలుగేళ్లు పట్టేస్తుంది. అయితే ఆ మధ్య కాలంలో బయట ఎక్కడా కనిపించకూడదంటూ మహేష్‌కు రాజమౌళి కండిషన్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఇక మహేష్‌ ఏ ఫంక్షన్లలోనూ కూడా కనిపించరేమో అని అనుకున్నారు. అయితే మహేష్‌ మాత్రం ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా నటించిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్ద విజయం సాధించలేదు.

డివైడ్‌ టాక్‌తో నడిచింది. అయితే వసూళ్లు మాత్రం బాగానే వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు మాత్రం మహేష్‌ ఫోకస్‌ అంతా కొత్త సినిమాపైనే ఉందట. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ మొత్తం పూర్తియపోయింది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆర్టిస్టులను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వచ్చే అవకాశాలున్నాయి.