MAHESH BABU: ఒక్కడు విషయంలో మహేశ్ తప్పు చేశాడా..? సోషల్ మీడియాలో రచ్చ..

తన కెరీర్‌లో తనని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, కెరీర్‌‌ని టర్న్ చేసిన సినిమాలు మురారి, పోకిరి, శ్రీమంతుడు అన్నాడు. అంటే.. అసలు తనకి మొదటి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఒక్కడుని ఎలా మర్చిపోయాడనేస్తున్నారు ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్.

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 06:10 PM IST

MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసమే రెడీ అవుతున్నాడు. అయితే ఆ సినిమా సంగతులు చెప్పే ప్రాసెస్‌లో తన కెరీర్‌ని మార్చిన మూడు సినిమాల గురించి మనసు విప్పాడు. అదే తప్పైపోయింది. మహేశ్ యాంటీ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేయటానికో టాపిక్ దొరికినట్టైంది. తన కెరీర్‌లో తనని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి, కెరీర్‌‌ని టర్న్ చేసిన సినిమాలు మురారి, పోకిరి, శ్రీమంతుడు అన్నాడు.

Vishwambhara: పూనకాలు లోడింగ్.. విశ్వంభర విలన్ దొరికాడు..

అంటే.. అసలు తనకి మొదటి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఒక్కడుని ఎలా మర్చిపోయాడనేస్తున్నారు. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్.. ఒక్కడు లాంటి మొదటి బ్లాక్ బస్టర్‌ని మహేశ్ మర్చిపోయాడు. గుణశేఖర్‌ని గాలికొదిలేశాడనే కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఓసారి ఆడియో ఫంక్షన్‌లో తన కెరీర్‌లో మర్చిపోలేని మూవీలంటూ ఓ లిస్ట్ చెప్పాడు. అందులో పోకిరి పేరు చెప్పడం మర్చిపోయాడు. అప్పుడు కూడా ఇలాగే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు ఫ్యాన్స్. తర్వాత పూరీ అంటే తనకి ఎంతో గౌరవం, ప్రేమ అంటూ మహేశ్ కూడా స్పెషల్ థ్యాంక్స్ వీడియోని అప్పట్లో రిలీజ్ చేశాడు బేసిగ్గా ఎవరైనా ఏదైనా విషయం ఎమోషనలై చెప్పినప్పుడు కొన్ని మర్చిపోయే ఛాన్స్ ఉంది.

అంతమాత్రాన ఎవరినో అవమానించాడనటం కరెక్ట్ కాదనే వాళ్లూ ఉన్నారు. మురారి, పోకిరి, శ్రీమంతుడు తనని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ, కెరీర్‌ని మార్చాయన్నాడు. కాని, కేవలం కెరీర్‌ని మార్చిన సినిమాలనలేదు. ఆలెక్కన తను ఒక్కడుని మర్చిపోయినట్టు కాదు. తనని ఇన్‌ఫ్లూయెన్స్ చేయని మూవీ అయ్యుండొచ్చనే మాటే నిజం కావొచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.