1500 కోట్లు సెన్సేషన్ .. జనవరి 9న ఫ్యాన్స్ లో పూనకాలే…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి తీసే సినిమా తాలూకు అప్ డేట్ వచ్చింది. ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడిచే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకాలం సైలెన్స్ వెనకున్నరీజన్ తేలింది. రాజమౌలి విజయ్ కి బాలీవుడ్ జనాలు కూడా ఫిదా అవ్వాల్సిందే అనే మాటే వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - October 13, 2024 / 02:24 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి తీసే సినిమా తాలూకు అప్ డేట్ వచ్చింది. ఫ్యాన్స్ రోమాలు నిక్కబొడిచే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకాలం సైలెన్స్ వెనకున్నరీజన్ తేలింది. రాజమౌలి విజయ్ కి బాలీవుడ్ జనాలు కూడా ఫిదా అవ్వాల్సిందే అనే మాటే వినిపిస్తోంది. జనవరి రెండో వారం లో అంటే కొత్త ఏడాది కొత్త వారంలో మహేశ్ బాబుతో రాజమౌలి సినిమా సెట్స్ పైకెళ్లబోతోంది. అప్పడే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా ముందు భారీ ఎనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నాడు రాజమౌళి. సినిమా టైటిల్, బడ్జెట్ తో పాటు బేసిక్ స్టోరీ లైన్ ఈ మూవీ లాంచ్ రోచే ఎనౌన్స్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొంతవరకు ఈ విషయాన్నే తన లీకులతో కన్పామ్ చేశాడు… ఇంతకి తన మాటలతో తేలిందేంటి? 

బాహుబలి, త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌలి ఇమేజ్ పెరిగినట్టే, తన మార్కెటింగ్ స్ట్రాటజీ మారింది. ఏకంగా జురాసిక్ పార్క్ క్రియేటర్ స్టేవెన్ స్పిల్ బర్క్ బ్యానర్ డ్రీమ్ వర్క్స్ తో కలిసి పాన్ వరల్డ్ మూవీ తీయబోతున్నాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఈ సినిమా ప్లాన్ చేశాడు. సూపర్ స్టార్ బర్త్ డే రోజు కాని, వినాయక చవితి, దసరా ఇలా ఎన్ని పండగలొచ్చి పోతున్న మహేశ్ మూవీ మొదలు కాలేదు

కనీసం అప్ డేట్ లేదు. దీనంతటికి కారనం హాలీవుడ్ బ్యానర్ పెట్టిన కండీషన్సే అన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. ఏదేమైనా సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే అప్ డేట్ ఇచ్చాడు విజయేంద్రప్రసాద్. 2025 జనవరిలో ఈ సినిమా లాంచ్ కాబోతోంది. తనిచ్చిన ఈ స్టేట్ మెంట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరలైంది

కొత్త న్యూసేంటంటే, ఈమూవీ 2025 జనవరి 9న లాంచ్ కాబోతోందట. 9 వ తారీకు 9 గంటల 9 నిమిషాలకు ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నారు. 11 గంటలకు భారీ ప్రెస్ మీట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఈ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్ కి ప్రభాస్, తారక్, ఎన్టీఆర్, నాని, రవితేజ ఇలా రాజమౌళి డైరెక్షన్ లో సినిమాలు చేసిన హీరోలంతా రాబోతున్నారు

చీఫ్ గెస్ట్ ఎవరో మాత్రం ఇంకాతేలలేదు. ఇక ఈ సినిమా లాంచ్ అయ్యాక 11 గంటలకు జరిగే ప్రెస్ మీట్ లో చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా సినిమా పోస్టర్ ని, టైటిల్ ని రివీల్ చేస్తారట. ఆతర్వాతే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాకి ఈ సినిమా స్టోరీలైన్, క్యారెక్టర్, లాంటి బేసిక్ ఇన్ ఫర్ మేషన్ ఇస్తాడట రాజమౌలి.

ఇందుకు సంబంధించి హాలీవుడ్ సంస్థ డ్రీమ్ వర్క్స్ తోపాటు, నెట్ ఫ్లిక్స్ పర్మీషన్ కూడా వచ్చేసిందని, కే ఎల్ నారాయణ తో పాటు ఈ మూవీని ఆ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్నాయని తెలుస్తోంది. 1500 కోట్ల బడ్జెట్ తో సౌత్ ఆఫ్రికాలో ఇండియానా జోన్స్ తరహాలో అద్భుతాల వేట కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిబోతోంది. విచిత్రం ఏంటంటే 50 కోట్లతో ఈగ తీస్తే 150 కోట్లొచ్చాయి. 150 కోట్లు పెట్టి, బాహుబలి తీస్తే 550 కోట్లొచ్చాయి. అంతే పెట్టి బాహుబలి 2 తీస్తే 1850 కోట్లొచ్చాయి. ఇప్పుడు 1500 కోట్లు అంటే ఆల్ మోస్ట్ బాహుబలి2 కి వచ్చిన 1850 కి దగ్గరగా ఉన్న నెంబర్, అంత పెట్టి తీయబోతున్నాడు. త్రిబుల్ ఆర్ 1250 కోట్ల వసూళ్ల ని పక్కన పెడితే, బాహుబలి 2 కి వచ్చిన కలెక్షన్స్ రేంజ్ ఎమౌంట్ తో మహేశ్ బాబు సినిమా తెరకెక్కబోతోంది. దీన్ని బట్టి చూస్తే సినిమా సినిమాకు రాజమౌలి మూవీ బడ్జెట్ ప్రీవియస్ సినిమా కలెక్షన్స్ రేంజ్ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టుంది. మొత్తానికి మెల్లిగా లోకల్, నేషనల్,ఆసియా, వరల్డ్ మార్కెట్ అంటూ తన మార్కెట్ ని పెంచేస్తున్నాడు రాజమౌళి.