ANIMAL: అసలు యానిమల్ మహేశ్ బాబా..?

ఈ సినిమా నిజానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయాల్సిందట. తను నో చెబితేనే బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ దగ్గరకు వెళ్లిందట. అసలేంటో.. సందీప్ రెడ్డి వంగ ఏ మూవీ చూసినా, ఎవరో ఒకరు రిజెక్ట్ చేశాకే, మరొకరి ఫేట్ మారుతుంది. గతంతో తను అర్జున్ రెడ్డి కథని బన్నీకి చెబితే.. తను నో చెప్పాడు.

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 06:11 PM IST

ANIMAL: యానిమల్ మూవీ టీజర్ అదిరిందని చాలా మంది మూవీ లవర్స్ అంటున్నారు. టీజర్ ఇచ్చిన కిక్ అలా ఉంది. రణ్‌బీర్ లుక్కు, టీజర్‌లో బ్యాగ్రౌండ్‌తో వచ్చిన మ్యూజిక్ కిక్ ఓరేంజ్‌లో ఉంది. కాని, షాకింగ్ న్యూసేంటంటే, ఈ సినిమా నిజానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయాల్సిందట. తను నో చెబితేనే బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ దగ్గరకు వెళ్లిందట.

అసలేంటో.. సందీప్ రెడ్డి వంగ ఏ మూవీ చూసినా, ఎవరో ఒకరు రిజెక్ట్ చేశాకే, మరొకరి ఫేట్ మారుతుంది. గతంతో తను అర్జున్ రెడ్డి కథని బన్నీకి చెబితే.. తను నో చెప్పాడు. విజయ్ దేవరకొండ ఆ సినిమా చేసి రౌడీ స్టారయ్యాడు. ఇక మహేశ్ బాబు కూడా గతంతో పుష్ప కథని రిజెక్ట్ చేశాడు. సుకుమార్ చెప్పిన కథ మరీ నాటుగా ఉందని, మరో కథతో రమ్మన్నాడని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అదే కథని పుష్ప అని తీస్తే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారాడు. సో.. ఇలానే యానిమల్ కథని మహేశ్ రిజెక్ట్ చేయటంతో రణ్‌బీక్ కపూర్‌కి ఆ సినిమా దక్కింది.

కాబట్టి తన ఫేట్ కూడా యానిమల్‌తో మారే ఛాన్స్ ఉంది. ఏదేమైనా, పుష్ప, యానిమల్ ఈ రెండు మాత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయాల్సినవే. కాని తను రిజెక్ట్ చేయటంతో తన ఎకౌంట్‌లో పడాల్సిన బ్లాక్ బస్టర్లు మరొకరి ఎకౌంట్‌లో పడ్డాయి.