MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇక మీదట దొంగలా దాక్కోవాల్సిందే. అంటే అంత తప్పేం చేశాడనే డౌట్ వస్తుంది. కాని అలాంటి పని చేసేందుకు తను విలన్ కాదు.. హీరో. కాబట్టి డెఫినెట్‌గా ఏదో తప్పు చేసి దాక్కోవాల్సిన ఖర్మ మహేశ్‌కు పట్టలేదు. పట్టదు. కాని చేయని తప్పుకి మాత్రం తను ఇబ్బంది పడక తప్పట్లేదు. ఆ తప్పే రాజమౌళి వల్ల జరిగినట్టుంది. మహేశ్ బాబుకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వెళ్లాయి.
KALKI 2898 AD: కల్కి అందుకే వాయిదా.. కాని ఎప్పుడో తెలుసా..?
ఇక మీదట గుడికొచ్చే భక్తులకి దైవ దర్శనం ఉన్నట్టు, ఫ్యాన్స్‌కి మహేశ్ తన దర్శనం ఇచ్చే ఛాన్స్ లేదట. ఏడాది వరకు ఇదే కండీషన్ ఫాలో అవ్వాల్సిందే అనేది జక్కన్న నిర్ణయం. రీసెంట్‌గా నమ్రత పోస్ట్ చేసిన ఫోటోలో కూడా మహేశ్ తన లుక్‌ని కంప్లీట్‌గా రివీల్ కాకుండా ఉండటం చూస్తుంటే, ఇక మీదట మహేశ్ బాబు ఏం చేసినా తను కనిపించకుండా చేయాల్సిందే అని అర్ధమౌతోంది. మహేశ్‌తో చేయబోయే సినిమా కోసం రాజమౌళి మే, జూన్ నెలల్లో వర్క్ షాపులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్లాన్ చేశారు. ఈలోగా వర్కవుట్లు, భారీగా జుట్టు పెంచి దాని మీద రకరకాల హేయిర్ స్టైల్స్ టెస్ట్ చేయటం లాంటివి చేస్తారట.
అంటే జుట్టు పెంచినంత మాత్రాన అలానే సినిమాలో కనిపిస్తాడని లేదు. ఆ జుట్టుని రకరకాల స్టైల్లో కత్తిరించి ఫైనల్ లుక్‌తో షూటింగ్ మొదలు పెడతారు. అక్టోబర్ నుంచి 2025 జూన్ వరకు బేసిక్ టాకీ పార్ట్ షూటింగ్ ఉంటుందట. తర్వాత తన లుక్ మారుతుందని, కాబట్టి అప్పటి వరకు మహేశ్ లుక్ రివీల్ కాకుండా ఉండాలనేది రాజమౌళి ఆర్డర్ అని తెలుస్తోంది.