ఆఫ్రికా తెగతో మహేష్, బాహుబలిలో కిలికిలి భాష, మరి ఇప్పుడూ…?

దర్శక ధీరుడు రాజమౌళి ఒక సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా ఆ సినిమాలో ఏదోక ప్రత్యేకత ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆయన సినిమాలు అన్నింటిలో ఏదోక ప్రత్యేకత సహజంగా ఉంటుంది.

  • Written By:
  • Updated On - September 3, 2024 / 01:51 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి ఒక సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా ఆ సినిమాలో ఏదోక ప్రత్యేకత ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆయన సినిమాలు అన్నింటిలో ఏదోక ప్రత్యేకత సహజంగా ఉంటుంది. బాహుబలి సినిమాలో కిలికిల భాష ఏ రేంజ్ లో ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. ఆ భాష ఆ సినిమాలో తప్పించి భూమి మీద ఏ దేశంలో కూడా ప్రజలు మాట్లాడలేదు. ఆ సినిమాకు ఆ సీన్ లు కూడా హైలెట్ అయ్యాయనే చెప్పాలి. ఇప్పుడు మహేష్ సినిమా కోసం కూడా అదే ప్లాన్ చేస్తున్నారు జక్కన్న.

ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా కోసం కష్టపడుతున్న జక్కన్న… ఈ సినిమాలో కోసం కాస్త భిన్నంగా ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. అడవుల్లో ఉండే ఒక తెగను ఈ సినిమాలో చూపించనున్నారు. అయితే వారికి సంబంధించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నారు. వారి ఆహారపు అలవాట్లు హైలెట్ చేయనున్నారు. సాధారణ మనుషుల కంటే భిన్నంగా ఆ తెగ ఆహారం తీసుకుంటుందని అలాగే వారి జీవన శైలి కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుందని టాక్. ఆఫ్రికాలో ఒక తెగపై స్టడీ చేసి ఈ సినిమాలో సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారట.

అలాగే వారికి ఒక కొత్త భాషను కూడా రాయిస్తున్నారని, ఆ తెగలో ఉండే మనుషుల వస్త్రధారణ అన్నీ కూడా భిన్నంగా ఉంటాయని, వాళ్లకు చెప్పులు లేకుండా కాళ్ళకు చెట్ల బెరడుతో కనపడేలా ప్లాన్ చేసారట. దీని కోసం హాలీవుడ్ సినిమాలకు చేసే ఒక ప్రముఖ వ్యక్తి పని చేస్తున్నారని సినీ కథనాలు వస్తున్నాయి. ఆ తెగలోనే మహేష్ పెరుగుతాడని టాక్. మరి ఏ విధంగా సినిమాను ప్లాన్ చేసాడు అనేది చూడాలి. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా ఉండనున్నారు. వచ్చే ఏడాది ఎలా అయినా ఈ సినిమాను విడుదల చేసేందుకు కష్టపడుతున్నారు జక్కన్న.