MAHESH BABU: మ‌హేశ్‌బాబుకు మ‌రో కొత్త టెన్ష‌న్‌..

తెలిసిన కథే అయినా కొత్త‌గా చెప్ప‌డంలో ఆరితేరిన త్రివిక్ర‌మ్ ఈసారి బ‌ల‌హీన‌మైన ర‌చ‌న‌తో నిరాశ‌ప‌రిచాడు. దీంతో.. భారీ డిజాస్ట‌ర్‌ను మ‌హేశ్ త‌న ఖాతాలో వేసుకోవాల్సి వ‌చ్చింది. మొత్తానికి సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఇక్కడే మహేష్‌కి సరికొత్త టెన్షన్ మొదలైంది.

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 12:42 PM IST

MAHESH BABU: సంక్రాంతి పండుగ‌.. అందులోనూ ఓ అగ్ర హీరో-అగ్ర ద‌ర్శ‌కుడి క‌ల‌యికలో సినిమా అంటే ఆ హంగామానే వేరు. గుంటూరు కారం విష‌యంలోనూ అదే జ‌రిగింది. ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత మ‌హేశ్-త్రివిక్ర‌మ్ క‌లిసి చేసిన సినిమా కావ‌డంతో.. ఈ మూవీకి విప‌రీత‌మైన హైప్ ఏర్ప‌డింది. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ మాస్ అవ‌తార్‌తో ప్ర‌భంజ‌నం సృష్టిస్తాడ‌న్న అంచ‌నాలు పెరిగిపోయాయి. తీరా మూవీ రిలీజయ్యాక సీన్ రివ‌ర్స‌య్యింది. గుంటూరు కారం ఘాటు ప్రేక్ష‌కుల‌కు స‌రిపోలేదు. గురూజీ మ‌సాలా మిస్స‌య్యిందంటూ ఫ్యాన్స్ కూడా డిజ‌ప్పాయింట్ అయ్యారు. త్రివిక్ర‌మ్ మేజిక్ ఏ ద‌శ‌లోనూ ఈ సినిమాలో క‌నిపించ‌లేదు.

Kavitha Liquor case: కవిత ఈసారి అరెస్టేనా ? ఈడీ ఏం చేయబోతోంది ??

తెలిసిన కథే అయినా కొత్త‌గా చెప్ప‌డంలో ఆరితేరిన త్రివిక్ర‌మ్ ఈసారి బ‌ల‌హీన‌మైన ర‌చ‌న‌తో నిరాశ‌ప‌రిచాడు. దీంతో.. భారీ డిజాస్ట‌ర్‌ను మ‌హేశ్ త‌న ఖాతాలో వేసుకోవాల్సి వ‌చ్చింది. మొత్తానికి సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో ఇక్కడే మహేష్‌కి సరికొత్త టెన్షన్ మొదలైంది. గుంటూరు కారం డిజాస్టర్‌ని నెత్తిన మోస్తూ రాజ‌మౌళి మూవీకి వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎన్నో అంచ‌నాల‌తో సంక్రాంతి బ‌రిలో అడుగుపెట్టిన మ‌హేశ్‌కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ‘గుంటూరు కారం’ మూవీపై దారుణంగా ట్రోల్ జరుగుతుంది. కేవలం మహేష్ బాబు వల్లే ఈ మూవీ ఆడుతుందని, దీనికన్నా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి మూవీ బెటర్ అంటూ అభిమానులే చెబుతున్నారు.

మ‌రో వైపు ‘హనుమాన్’ మూవీతో క్లాష్, థియేటర్ల సమస్య వంటి వివాదాల ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై గట్టిగానే పడింది. దీంతో.. ఇప్పుడు మ‌రో మూడేళ్ల వ‌ర‌కు మ‌హేశ్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక‌వేళ గుంటూరు కారం క‌నుక త‌న రేంజ్ హిట్‌ను అందుకొని ఉంటే.. ఆ జోష్‌తో రాజ‌మౌళి మూవీకి సెట్స్‌పైకి వెళ్లి ఉండేవాడు మ‌హేశ్. ఆ ఉత్సాహంతో ఫ్యాన్స్ కూడా రాజ‌మౌళి- మ‌హేశ్ మూవీ కోసం ఎన్నేళ్లైనా ఎదురు చూసే వాళ్లు. కానీ.. గుంటూరు కారం మూవీ డిజాస్ట‌ర్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ ప్లాప్‌ను నెత్తిన పెట్టుకొని జక్కన్న ప్రాజెక్ట్‌ని మహేష్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో మహేష్ బాబుతో రాజమౌళి భారీ ప్రయోగమే చేయబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.

Allu Arjun’s son Allu Ayan  : నువ్వు ఏదో కంత్రీలా ఉన్నావు బేటా..

ఆ ప్రయోగం కాస్త అటు ఇటూ అయితే ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న‌లూ వినిపిస్తున్నాయి. భ‌ర‌త్ అనే నేను మూవీ నుంచి స‌ర్కారు వారి పాట వ‌ర‌కు వ‌చ్చిన మ‌హేష్ మూవీల‌న్నీ డీసెంట్ హిట్ అన్న టాక్‌ను సొంతం చేస‌కున్నాయి. దీంతో.. మ‌హేష్ రేంజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం ఈ మ‌ధ్య‌కాలంలో మ‌హేశ్ ఖాతాలో ప‌డలేదు. గుంటూరు కారం మీద పెట్టుకున్న హోప్స్ మొత్తం మ‌ఠాష్ అయిపోయాయి. సో.. ఇక‌ మ‌హేశ్‌తో పాటు ఫ్యాన్స్ కూడా రాజ‌మౌళి మూవీపైనే ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు. మ‌రి.. జ‌క్క‌న్న సూప‌ర్ స్టార్‌కు ఎలాంటి స‌క్సెస్ అందిస్తాడో చూడాలంటే మాత్రం మ‌రో మూడేళ్లు ఆగాల్సిందే.