Mahesh Babu: టాక్, జానర్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబట్టగల స్టార్స్‌లో మహేష్ బాబు ఒకరు. ఇటీవల విడుదలైన ‘గుంటూరు కారం’ సినిమా డివైడ్ టాక్‌తో కూడా రూ.100 కోట్ల షేర్ రాబట్టింది అంటే అది పూర్తిగా మహేష్ స్టార్‌డమ్ అనే చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ రిలీజ్ చేస్తున్న కలెక్షన్ల పోస్టర్ల విషయంలో మాత్రం ట్రోల్స్ వస్తున్నాయి. ‘గుంటూరు కారం’ వసూళ్ల విషయంలో ట్రేడ్ వర్గాలు, మేకర్స్ చెబుతున్న లెక్కలకి చాలా తేడా ఉంది.
Saif Ali Khan: దేవర’ షూటింగ్‌లో ప్రమాదం.. సైఫ్ అలీ ఖాన్‌కు గాయాలు..
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా పది రోజుల్లో సుమారుగా రూ.176 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే మేకర్స్ మాత్రం ఈ సినిమా రూ.231 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రెండింటి మధ్య ఏకంగా రూ.55 కోట్ల వ్యత్యాసం ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఈ కలెక్షన్ల గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ‘గుంటూరు కారం’ వసూళ్ళని కొందరు కావాలనే తక్కువ చేసి చూపిస్తున్నారని.. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారని, ప్రొడ్యూసర్స్ చెబుతున్న లెక్కలే కరెక్ట్ అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఈ కలెక్షన్లు పోస్టర్లకే పరిమితమని ట్రోల్ చేస్తున్నారు.
‘హనుమాన్’ సినిమా 200 కోట్ల గ్రాస్ రాబట్టడంతోనే.. దానిని మించిన కలెక్షన్స్ వచ్చాయని చెప్పడం కోసమే రూ.231 కోట్ల గ్రాస్ పోస్టర్ రిలీజ్ చేశారని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ట్రేడ్ వర్గాలు, మేకర్స్ చెబుతున్న వసూళ్ల మధ్య భారీ వ్యత్యాసం ఉండటం హాట్ టాపిక్‌గా మారింది.