Sitara Ghattamaneni: మహేష్‌బాబు ఇంట విషాదం నెలకొంది. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మహేష్ కుమార్తె సితార, ఆయన భార్య నమ్రత చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంతకు ఏం జరిగింది అంటే సితార.. ఏడేళ్లుగా ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఫ్లూటో చనిపోయింది. దీంతో ఫ్లూటోతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సితార, నమ్రత ఎమోషనల్ అయ్యారు. దానితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి భావోద్వేగానికి లోనయ్యారు.
చిన్న పిల్లలు జంతువులను ఎంతలా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటికి చిన్న గాయం అయితేనే కొందరు పిల్లలు ఇళ్లు పీకి పందిరేస్తారు. తమ పెట్స్ కోలుకునే వరకు బాధపడతారు. సితార కూడా తన పెట్ ఫ్లూటో మీద అలాంటి ప్రేమనే పెంచుకుంది. ఏడేళ్లు తనతో ఉన్న పెట్ కన్నుమూయడంతో చాలా బాధపడుతోంది. ఇక కుమార్తె బాధ చూసి నమ్రత ఓదార్చే ప్రయత్నం చేశారు. ఫ్లూటోతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఏడేళ్ల బంధం.. మిస్ యూ.. అంటూ పోస్ట్ చేసి భావోద్వేగానికి గురయ్యారు.
ఇదిలా ఉంటే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు రాజమౌళి మూవీ కోసం ఇప్పటినుంచి ఫిజికల్‌గా సరికొత్త లుక్‌లో కనిపించేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. మరోవైపు కూతురు సితార కూడా యాడ్స్‌లో నటిస్తోంది. ఇలా అంతా హ్యాపీగా ఉన్న ఈ ఫ్యామిలీలో తాజాగా విషాదం నెలకొంది. దీంతో అభిమానులు సైతం ఆవేదన చెందుతున్నారు.