ఇప్పటికీ కథ రెడీ కాకపోయే సరికి మహేశ్ అసలు గుంటూరు కారం ప్రాజెక్టే పక్కన పెట్టాలనుకుంటున్నాడట. లండన్ ట్రిప్ నుంచి వచ్చాక ఈ సినిమా సెకండ్ హాఫ్ కథ సంతృప్తికరంగా రెడీ చేయకపోతే ప్రాజెక్ట్ ఆగిపోవటం కన్ఫామ్ అంటున్నారు. అంతేకాదు ఈ వేగంతో సినిమా తీస్తే సంక్రాంతికి గుంటూరు కారం సీన్లో ఉండకపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పొంగల్ పోరు నుంచి ఈ పాటికే ప్రాజెక్ట్ కే పక్కకు పోయింది. ఓజీ కూడా సమ్మర్ కే రిలీజ్ అంటున్నారు. దీంతో సంక్రాంతికి గుంటూరు కారం ఒక్క మూవీనే సీన్లో ఉంటుందనుకుంటే, అది కూడా జరిగేలా లేదు. పొంగల్ ని పెద్ద హీరోలంతా వదిలేసేలా ఉన్నారు. ఈవిషయంలో మహేశ్ తప్పులేదు. త్రివిక్రమ్ మిస్టేక్స్ వల్లే ఇలా జరిగేలా ఉంది. అంతేకాదు ఇలాంటి టైంలో బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ లో కనుక మాటల మాంత్రికుడు ప్రత్యక్షమైతే మహేశ్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది.
కాబట్టే బ్రో మూవీకి కథనం రాసినా, అందులో షేర్ ఉన్నా ఆ ఈవెంట్ లో త్రివిక్రమ్ కనిపించలేదు. మహేశ్ బాబు ని ఫేస్ చేయటం కష్టమని. ఆరేంజ్ లో త్రివిక్రమ్ వర్క్ మీద సూపర్ స్టార్ అసంతృప్తితో ఉన్నాడు. ఏదేమైనా బ్రో ఈవెంట్ లో త్రివిక్రమ్ సందడి కనిపించకపోవటానికి మహేశ్ బాబు మాత్రమే కాదు. హరీష్ శంకర్, క్రిష్ కూడా ఒక కారణం అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ త్రివిక్రంతో పాటూ హరీష్, క్రిష్ వస్తే వాళ్లని ఎలా ఫేస్ చేయాలో తెలియక మాటల మాంత్రికుడు సైలెంట్ అయ్యాడట.