Guntur Karam : గుంటూరు కారం దుమ్ములేపే సాంగ్ 600 మంది డ్యాన్సర్లతో మహేష్ చిందులు..

సర్కారు వారి పాట (Sarkaru Vari Pata) తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) చేస్తున్న సినిమా గుంటూరు కారం (Guntur Karam) . త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram), మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి.. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే థియేటర్లో దుమ్ములేపే అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సర్కారు వారి పాట (Sarkaru Vari Pata) తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) చేస్తున్న సినిమా గుంటూరు కారం (Guntur Karam) . త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram), మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి.. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టే థియేటర్లో దుమ్ములేపే అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఫ్యాన్స్‌ దమ్ మసాలా మాస్ బీట్‌కు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే గుంటూరు కారం సినిమా వారం టాకీ పార్ట్.. పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తి అయిందని తెలుస్తోంది.

UV Creations: ఫ్లాప్ హీరోలతో యూవీ క్రియేషన్స్ రిస్క్..

ప్రజంట్ దమ్ మసాలా సాంగ్ షూటింగ్‌ జరుగుతున్నట్టుగా సమాచారం. ముందుగా ఈ సాంగ్‌ని సినిమాలోని పలు సీన్స్ కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌గా అనుకున్నారట. కానీ సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో.. అదిరిపోయే విజువల్స్‌తో చిత్రీకరిస్తున్నారట. ఏకంగా 600 మందికి పైగా డ్యాన్సర్లతో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ షూట్ చేస్తున్నారట. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన మిర్చి మార్కెట్ యార్డ్‌ సెట్‌లో షూటింగ్‌ చేస్తున్నారట. మొత్తంగా ఈ పాట థియేటర్లో దుమ్ములేపేలా ఉంటుందని అంటున్నారు.

చిత్రీకరిస్తున్న పాట తర్వాత మహేష్ బాబు , శ్రీలీలపై విదేశాల్లో రెండు పాటల చిత్రీకరణ జరపాల్సి ఉందట. మొత్తంగా ఈ సినిమా షూటింగ్‌ డిసెంబర్‌ మూడో వారంలో కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట మహేష్‌ బాబు. ఆ తర్వాత కొత్త సంవత్సరం వేడుకల కోసం విదేశాలకు ఫ్యామిలీ ట్రిప్ వెయనున్నాడట. తిరిగొచ్చిన తర్వాత గుంటూరు కారం ప్రమోషన్స్ చేస్తారని తెలిసింది. సినిమాలో శ్రీలీలతోపాటు మరో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గుంటూరు కారం రిలీజ్ కానుంది. అతడు, ఖలేజా తర్వాత పుష్కర కాలానికి మహేష్, త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమా.. ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.