టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ రానాకు సేపెరేట్ ఇమేజ్ ఉంది. నచ్చినప్పుడు సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు పలు వేదికలపై మెరిసే రానాకు సేపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రానా దగ్గుబాటి సెన్సాఫ్ హ్యూమర్ కూడా హైలెట్ అవుతూ ఉంటుంది. హోస్ట్ గా ఆయన ఎక్కడైనా పాల్గొంటే తన జోక్స్ తో అందరిని నవ్విస్తూ ఉంటారు. సెటైరికల్ పంచ్‌లతో రియాలిటీ షోస్ ఆడియన్స్ ను అలరిస్తాడు. అందుకే రానా హోస్ట్ గా చేసిన షోస్ కి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంటుంది. బిగ్ బాస్ కూడా రానా చేయాలనే డిమాండ్ లు ఉన్నాయి.
రీసెంట్ గా అబుదాబిలో నిర్వహించిన ఐఫా అవార్డుల వేడుకలో… హనుమాన్ ఫేం, యంగ్ సెన్సేషన్ తేజ సజ్జతో కలిసి రానా హోస్ట్ గా చేసాడు. ఈ షో లో రానా జోక్స్, పంచ్ లకు కొందరు హీరోల ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. ఈ హీట్ డైరెక్టర్ హరీష్ శంకర్‌కి కూడా గట్టిగానే తగిలింది. దీనితో హరీష్ శంకర్ తన మార్క్ రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే హరీష్… మిస్టర్ బచ్చన్ టైం లో ఫ్యాన్స్ నుంచి కాస్త సెటైర్ లు ఎదుర్కొన్నాడు. అందుకే ఇప్పుడు కాస్త స్లోగా ఉంటున్నాడు. అనవసరంగా రిప్లై ఇవ్వడం లేదు.
రానా ఐఫా అవార్డ్స్ ఈవెంట్లో తేజ సజ్జతో మాట్లాడే క్రమంలో… ఈ ఇయర్ అమితాబ్ బచ్చన్ కెరీర్ లో అతి పెద్ద ఎత్తును, లోతును చూశారని ఓ సెటైర్ వేసారు. ఎత్తు ఏంటీ అంటూ తేజా అడగగా… రానా కల్కి అని ఆన్సర్ ఇచ్చాడు. లోతు ఏంటి మరి అని అడిగితే… అదే “మిస్టర్..” అని మిస్టర్ బచ్చన్ ను ట్రోల్ చేస్తూ కామెంట్ చేసాడు. దీనికి రవితేజా ఫ్యాన్స్ హర్ట్ అయి… హరీష్ శంకర్ ను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేసారు. మళ్ళీ మనం కాలర్ ఎగిరేసే సినిమా తీయాలని.. రానా మాట్లాడిన వీడియోని ట్యాగ్ చేసారు.
దీనికి రియాక్ట్ అయిన హరీష్.. “ఎన్నో విన్నాను తమ్ముడు, అందులో ఇదొకటి. అన్ని రోజులు ఒకేలా ఉండవు, నాకైనా.. ఎవరికైనా అని రియాక్ట్ అయ్యాడు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇప్పుడు రానాపై సీరియస్ గా ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ… గుంటూరు కారం సినిమాపై తేజ ‘హనుమాన్’ చిత్రం విజయం సాధించగా… రానా ఆ విషయాన్ని సెటైరికల్ గా మాట్లాడాడు. దీనితో మహేష్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. తోటి నటులపై జోక్స్ వేయడం రానాకు మంచిది కాదు అంటూ పంచ్ లు వేస్తున్నారు.