ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా అనుష్క నటించి.. గ్లామర్‌కే గ్రామర్ నేర్పింది. లిప్ లాక్స్‌తో తనదైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఖలేజా సినిమా రిలీజ్ అయ్యాక.. ఇంత కథ ఉంటే.. ఆ సినిమా విడుదలకు ముందు మరో స్టోరీ ఉంది. అదే టైటిల్ గొడవ. ఖలేజా టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు బాగానే ఉంది. సినిమా రిలీజ్ తేదీ ప్రకటించగానే ఎవరో ఒక వ్యక్తి వచ్చి.. ఆ టైటిల్ తనదని, ఆ టైటిల్ తను రిజిస్టర్ చేసుకున్నానని కోర్టుకెక్కాడు.
సినిమా రిలీజ్ కాకుండా ఇంజెక్షన్ ఆర్డర్ ఇమ్మన్నాడు. రిలీజ్ ఆపలేం కానీ నష్టపరిహారం కోరాలని జడ్జి సూచించగా.. పది లక్షలు పరిహారంగా ఇచ్చేందుకు సిద్ధమైంది ఖలేజా యూనిట్. ఇది అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మరోలా ఉండేది కానీ.. పది లక్షలు కాదు పాతిక లక్షలు కావాలని ఆ వ్యక్తి అడ్డం తిరిగాడు. అతని అత్యాశ గమనించిన చిత్ర యూనిట్.. అతని ప్రపోసల్ కి నో చెప్పి సినిమా టైటిల్‌కి ముందు హీరో మహేష్ బాబు పేరు యాడ్ చేసి.. మహేష్ ఖలేజా అంటూ సినిమా రిలీజ్ చేసింది. ఇక అప్పటి నుంచి ఏదైనా టైటిల్ వివాదం వస్తే ఆ టైటిల్ కి ముందు హీరో పేరు పెట్టి సైలెంట్ గా రిలీజ్ చేసేయడం.. ట్రెండ్‌గా మారిపోయింది . అలా వచ్చినవే కల్యాణ్‌రామ్ కత్తి, రాంగోపాల్ వర్మ కీ ఆగ్.