సీనియర్ యాక్టర్ దగ్గర మహేష్ కన్నడ క్లాసులు, దీనెమ్మ మామూలు ప్లానింగ్ కాదు

తెలుగు సినిమాలు ఇప్పుడు కన్నడ పై ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి. కన్నడలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉండటం అక్కడ తెలుగు వారు కూడా ఎక్కువగా ఉండటంతో తెలుగు సినిమాలకు ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - December 23, 2024 / 05:13 PM IST

తెలుగు సినిమాలు ఇప్పుడు కన్నడ పై ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి. కన్నడలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉండటం అక్కడ తెలుగు వారు కూడా ఎక్కువగా ఉండటంతో తెలుగు సినిమాలకు ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరా సినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది. అలాగే పుష్పా 2 కూడా కాస్త పర్వాలేదనిపించింది. ఇక మన తెలుగు సినిమాలు బెంగళూరు, బళ్ళారి కొన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్ల రాబడుతున్న విషయం గ్రహించారు మన ప్రొడ్యూసర్లు.

దీనితో మన స్టార్ హీరోలు కూడా అక్కడ సినిమాల రిలీజ్ విషయంలో విషయంలో సీరియస్ ప్లానింగ్ తో దిగుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల విషయంలో స్టార్ హీరోలు తమ డబ్బింగ్ తామే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని భాషలను నేర్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా కన్నడ నేర్చుకోవడానికి నాన్న కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేస్తున్న మహేష్ బాబు కన్నడ నేర్చుకుని కన్నడకు తానే డబ్బింగ్ చెప్పాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టు టాక్.

రెండు పార్ట్ లు గా వస్తున్న ఈ సినిమాను 2026లో మొదటి పార్ట్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రాజమౌళి సంగతి తెలిసిన జనాలు మాత్రం 2028 వరకు ఆ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయ్యే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు కాస్త సీరియస్ గా ఉండటంతో సినిమా త్వరగా నే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ అనలిస్ట్ లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదే టైంలో మహేష్ బాబు అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి నాన కష్టాలు పడుతున్నాడు.

తమిళం కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు. మలయాళం నేర్చుకోవాలనుకుంటే టైం పట్టే ఛాన్స్ ఉండటంతో తమిళం, కన్నడం అలాగే హిందీలో కూడా డబ్బింగ్ తానే చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్పెషల్ క్లాసులు కూడా ఒక సీనియర్ కన్నడ నటుడితో తీసుకుంటున్నారని సమాచారం. దేవరాజ్ అనే ఒక సీనియర్ నటుడు అటు కన్నడలో కూడా ఫేమస్. ఇటు తెలుగులో కూడా ఆయన కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన దగ్గర మహేష్ బాబు కన్నడ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. రాజమౌళి కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కన్నడ వాళ్లకు భాష మీద అభిమానం ఎక్కువ కాబట్టి కచ్చితంగా డబ్బింగ్ మహేష్ బాబు చెప్తే సినిమాకు ప్లస్ ఛాన్స్ ఉంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.