అన్న కొడుకు ఎంట్రీ కోసం మహేష్ భారీ స్కెచ్

టాలీవుడ్ లో స్టార్ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వాళ్ళను ఆకాశానికి ఎత్తేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 10:40 AM IST

టాలీవుడ్ లో స్టార్ ఫ్యామిలీ నుంచి ఒక హీరో వస్తున్నాడంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వాళ్ళను ఆకాశానికి ఎత్తేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో విషయంలో కూడా ఇంతే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఇప్పుడు టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు రంగం సిద్దమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్మార్ట్ గా కనపడుతున్నాడు జయకృష్ణ.

జయకృష్ణ కెరీర్ ప్లానింగ్ మొత్తం మహేష్ బాబు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రమేష్ బాబు సినిమాల్లో అంతగా రాణించలేదు. నిర్మాతగా కొన్ని సినిమాలు మాత్రమే చేసారు ఆయన. అయితే రెండేళ్ళ క్రితం అనూహ్యంగా జయకృష్ణ మరణించారు. ఇక అప్పటి నుంచి జయకృష్ణ బాధ్యతలు అన్నీ మహేష్ బాబు స్వయంగా చూసుకుంటున్నారు. గౌతం కంటే ముందు జయకృష్ణను టాలీవుడ్ కి పరిచయం చేయాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం మహేష్ ఒక సినిమాను కూడా ఎంచుకున్నారు అని టాక్.

రాజమౌళితో తాను చేయబోయే సినిమాలో జయకృష్ణను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు. ఈ సినిమాలో ఒక కీలక రోల్ కోసం సిద్దం చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. దీనికి జక్కన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు మహేష్… జయకృష్ణకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారట. ఇప్పటికే నటనకు సంబంధించి క్లాస్ లకు వెళ్ళిన జయకృష్ణ… ఎంట్రీ గ్రాండ్ గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు ఈ లుక్స్ బయటకు వదిలారని టాక్. మహేష్ బాబు, రాజమౌళి చేయబోయే సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ లుక్ పూర్తి భిన్నంగా ఉండనుంది. పూర్తి స్థాయిలో మహేష్ జుట్టుతో కనపడతాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.