Vikram : వణుకు తెప్పించిన ‘తంగలాన్’ మేకింగ్ వీడియో..

చియాన్ విక్రమ్ (Vikram).. ఈ పేరు వింటే చాలు, ఎలాంటి క్యారెక్టర్ అయిన భయపడాల్సిందే. సినిమా కోసం ఎంత రిస్క్ అయినా, ఏం చేయడానికైనా ముందుండే హీరోల్లో విక్రమ్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు.

చియాన్ విక్రమ్ (Vikram).. ఈ పేరు వింటే చాలు, ఎలాంటి క్యారెక్టర్ అయిన భయపడాల్సిందే. సినిమా కోసం ఎంత రిస్క్ అయినా, ఏం చేయడానికైనా ముందుండే హీరోల్లో విక్రమ్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి సినిమాలు చూస్తే.. విక్రమ్ యాక్టింగ్‌కు కొలమానం లేదనేలా ఉంటుంది. విక్రమ్ చేసే ప్రతి సినిమా వైవిధ్యంగానే ఉంటుంది. ముఖ్యంగా విక్రమ్ మేకోవర్ చూస్తే షాక్ అవాల్సిందే. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. యాక్టింగ్ అండ్ మేకోవర్ విషయంలో విక్రమ్ తర్వాతే ఎవ్వరైనా. తాజాగా విక్రమ్ కొత్త సినిమా నుంచి మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

పా.రంజిత్ దర్శకత్వంలో ‘తంగలాన్’ (Thangalan) అనే సినిమాలో నటిస్తున్నాడు విక్రమ్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా ఏప్రిల్ 17న విక్రమ్ బర్త్ డే సందర్భంగా ‘తంగలన్’ నుంచి మరో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో విక్రమ్‌ను చూస్తే ఔరా అనాల్సిందే. మొహానికి మసి పూసుకొని.. తన పాత్ర కోసం విక్రమ్ ఎంతలా కష్టపడ్డాడో ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. ముఖ్యంగా విక్రమ్ కాస్ట్యూమ్స్, ఆ గెటప్ చూస్తే.. ఖచ్చితంగా ఈ సినిమా విక్రమ్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిపోయేలా ఉంది.

ఇక ఈ సినిమా.. కేజీయఫ్ గనుల్లో జరిగిన కొన్ని నిజఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇది ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజియఫ్‌కి పూర్తి భిన్నమైన కథాంశంతో రూపొందుతోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి తంగలాన్ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.