Malavika Mohanan: ఎందుకు తొందర పడుతున్నావు.. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి..?

లేటెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న్యూ మూవీ ది రాజా సాబ్‌లో హీరోయిన్‌‌గా చేస్తుంది. మరికొన్ని రోజుల్లో ప్రభాస్‌తో కలిసి ఒక సాంగ్ షూట్‌లో కూడా పాల్గొనబోతుంది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్ట్ మూవీ. లేటెస్ట్‌గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది.

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 05:12 PM IST

Malavika Mohanan: 2013లో వచ్చిన పట్టం పోలె అనే మలయాళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నటి మాళవిక మోహనన్. అందులో దుల్కర్ సల్మాన్‌కి జోడిగా నటించి మంచి పేరు సంపాదించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె యు మోహనన్ ఆమె తండ్రి. లేటెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న్యూ మూవీ ది రాజా సాబ్‌లో హీరోయిన్‌‌గా చేస్తుంది. మరికొన్ని రోజుల్లో ప్రభాస్‌తో కలిసి ఒక సాంగ్ షూట్‌లో కూడా పాల్గొనబోతుంది.

Jr NTR: నెక్స్ట్ వార్ ఇక్కడే.. ఈసారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘యుద్ధం’ ఇక్కడే

తెలుగులో ఆమెకి ఇదే ఫస్ట్ మూవీ. లేటెస్ట్‌గా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా నిలిచాయి. మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ కూడా ఉన్నారు. తాజాగా ఆస్క్ మాళవిక పేరిట ట్విట్టర్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఒక అభిమాని వేసిన ప్రశ్నకి మాత్రం తనదైన రీతిలో జవాబు ఇచ్చింది. గ్లామర్ షోకి బదులు నటించడం ఎప్పుడు ప్రారంభిస్తారు అని అడిగాడు ఓ అభిమాని. నేను చెయ్యను నీకేమైనా ఇబ్బందా అని అతడికి ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది. ఇంకో అభిమాని పెళ్లి ఎప్పుడనే ప్రశ్న వేసాడు. నా పెళ్లి చూసేందుకు నువ్వెందుకు తొందర పడుతున్నావ్ అని జవాబు ఇచ్చింది. ఈ రెండు విషయాలు చాలు తను ఎంత స్పెషలో చెప్పడానికి.

మాళవికకి లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్‌లలో నటించడం అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని తనే చాలా ఇంటర్వూస్‌లో చెప్పింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ పేట, ఇళయ దళపతి విజయ్.. మాస్టర్, ధనుష్ మారన్‌లలో నటించింది. ఇవి తెలుగులో కూడా విడుదల అయ్యాయి. ప్రస్తుతం విక్రమ్ తంగలాన్‌లో చేస్తుంది. మొదటి సారి డీ గ్లామరైజ్డ్ పాత్రలో మెరిసింది. తన పాత్రకి తొలిసారి తనే డబ్బింగ్ చెప్పుకుంది. అతి త్వరలోనే తంగలాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది