Lakshmika Sajeevan: ఒకప్పుడు హార్ట్ ఎటాక్ అంటే వయసు మీద పడిన వ్యక్తుల్లో మాత్రమే చూసేవాళ్లం. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తున్న గుండెపోట్లు ప్రతీ ఒక్కరిని భయపెడుతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. తాజాగా.. కేవలం 24 ఏళ్ల వయసులోనే యువనటి లక్ష్మికా సజీవన్ హార్ట్ ఎటాక్‌తో చనిపోవడం మలయాళ సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. మళయాలంలో పలు హిట్ సినిమాల్లో లక్ష్మిక నటించింది.
Extra Ordinary Man Review: నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ హిట్ కొట్టినట్టేనా..!
అట్టడుగు వర్గాల పోరాటాలను వెలుగులోకి తెచ్చి, అత్యంత ప్రశంసలు పొందిన ‘కాక్క’ సినిమాలో లక్ష్మికా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో లక్ష్మిక నటనకు ప్రేక్షకుల నుంచి విశేష ఆధరణ లభించింది. ఇదే కాకుండా.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఒరు యమందన్ ప్రేమకథ సినిమాలో కూడా లక్ష్మి కీ రోల్ ప్లే చేసింది. పంచవర్ణతాతా, సౌదీ వెల్లక్క, పూజయమ్మ, ఉయరే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్ లాంటి సినిమాల్లో తనదైన నటనతో ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది లక్ష్మిక.
కొచ్చిలోని వజవేలిల్‌కు చెందిన లక్ష్మిక.. సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బ్యాంకింగ్ రంగంలో కూడా ఉద్యోగం చేస్తోంది. షార్జాలో ఉన్న సమయంలోనే ఆమె హార్ట్ ఎటాక్‌కు గురయ్యింది. కనీసం పాతికేళ్లు కూడా నిండకుండానే లక్ష్మి చనిపోవడం ఇప్పుడు మళయాలి సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ లక్ష్మిక ఫ్యాన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు.