Meera Jasmine: నటి మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. జోసెఫ్‌కు ఇప్పుడు 83 ఏళ్లు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థకు గురైన జోసెఫ్.. ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ట్రీట్‌మెంట్ అందిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు.
Boy In Borewell: ప్రాణం కాపాడారు.. బోరుబావి నుంచి సేఫ్‌గా సాత్విక్ రెస్క్యూ..!
ఆయనకు భార్య ఏలియమ్మ జోసెఫ్‌తో పాటు పిల్లలు మీరా, జిబి సారా జోసెఫ్, జెని సారా జోసెఫ్, జార్జ్, జాయ్ కూడా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. నిజానికి మీరా జాస్మిన్ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చినా.. తన కుటుంబం గురించి మీరా పెద్దగా ఎక్కడా చెప్పలేదు. సినిమాలకు అతీతంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఎవరూ ఇంకేమీ తెలుసుకోవాలనుకోలేదని మీరా జాస్మిన్ అంటుండేది. 2001లో మలయాళ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన ఆమె.. తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేసింది.
అమ్మాయి బాగుంది అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీరాజాస్మిన్.. తర్వాత తెలుగులో గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారధి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, మోక్ష లాంటి సినిమాల్లో నటించింది. ఈ మధ్యనే రీఎంట్రీలో విమానం అనే సినిమాలో చిన్న అతిథి పాత్రలో కనిపించింది. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఒక తమిళ సినిమా ఉంది. తెలుగులో కూడా ఒక మంచి ప్రాజెక్టు ద్వారా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.