2018 MOVIE: ఆస్కార్‌ బరిలో 2018 సినిమా..!

కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన 2018 ఎవ్రీ వన్‌ ఈజ్‌ హీరో సినిమా అధికారికంగా ఆస్కార్‌ బరిలో నిలిచింది. 96వ ఆస్కార్స్‌లో బెస్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ కేట‌గిరీలో ఈ సినిమా పోటీప‌డ‌నుంది. ఫైన‌ల్ నామినేష‌న్స్‌లో ఈ సినిమాకు చోటు ద‌క్కే అవ‌కాశం ఉన్నట్లు టాక్‌.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 05:10 PM IST

2018 MOVIE: 2024 ఆస్కార్‌ సందడి మొదలైంది. 2023లో ట్రిపులార్‌ సినిమా ఆస్కార్‌ అవార్డ్‌ను ఇండియాకు తీసుకువచ్చి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మరో అవార్డును తీసుకొచ్చేందుకు మరో సినిమా రెడీ అయ్యింది. కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన 2018 ఎవ్రీ వన్‌ ఈజ్‌ హీరో సినిమా అధికారికంగా ఆస్కార్‌ బరిలో నిలిచింది.

96వ ఆస్కార్స్‌లో బెస్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ కేట‌గిరీలో ఈ సినిమా పోటీప‌డ‌నుంది. ఫైన‌ల్ నామినేష‌న్స్‌లో ఈ సినిమాకు చోటు ద‌క్కే అవ‌కాశం ఉన్నట్లు టాక్‌. ఈ సినిమాలో టొవినో థామ‌స్‌, కుంచ‌కోబోబ‌న్‌, వినీత్ శ్రీనివాస‌న్‌, అసిఫ్ అలీ లీడ్‌ క్యారెక్టర్స్‌ చేశారు. వ‌ర‌ద‌ల కార‌ణంగా కేరళలో కొంత‌మంది జీవితాలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయి అనేది సినిమా లైన్‌. రిలీజ్‌ తరువాత ఈ సినిమా క్రియేట్‌ చేసిన హైప్‌ అంతా ఇంతా కాదు. మొదటి నుంచి ఎండ్‌ కార్డ్‌ వరకూ ప్రేక్షకులకు స్క్రీన్‌కు కట్టి పడేస్తుది సినిమా. మ‌ల‌యాళంలో మే 5న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబ‌ట్టింది. మ‌ల‌యాళ సినీ చ‌రిత్రలోనే అత్యధిక క‌లెక్షన్స్‌ సాధించిన సినిమాగా 2018 మూవీ స‌రికొత్త చ‌రిత్రను సృష్టించింది. తెలుగులోనూ ఈ సినిమాను అదే పేరుతో నిర్మాత బ‌న్నీవాస్ రిలీజ్ చేశారు.

తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా ఈ ఏడాది నిర్మాత‌ల‌కు భారీ లాభాల్ని మిగిల్చిన డ‌బ్బింగ్ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. భార‌త్ నుంచి ఆస్కార్ ఎంట్రీ కోసం తెలుగు సినిమాలు ద‌స‌రా, బ‌ల‌గం పోటీప‌డ‌నున్నట్టు ప్రచారం జ‌రిగింది. కానీ ఈ సినిమాల‌కు నిరాశే మిగిలింది. దేశ‌వ్యాప్తంగా వివిధ భాష‌ల నుంచి 22 సినిమాలు పోటీప‌డిన‌ట్లు స‌మాచారం. వాటిలో నుంచి 2018 సినిమాను అఫీషియ‌ల్‌గా జ్యూరీ ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలిసింది. మరి ఈ సినిమా ఫైనల్‌ వరకూ వెళ్లి ఆస్కార్‌ సాధిస్తుందా లేదా చూడాలి.